2026 లో శ్రీవిష్ణు లైనప్ మామూలుగా లేదే!
యంగ్ హీరో శ్రీ విష్ణు `సింగిల్` తో ఈ ఏడాది మంచి విజయాన్నే అందుకున్నాడు. దీంతో వచ్చిన సక్సెస్ క్రేజ్ ను మళ్లీ పట్టాలు తప్పకుండా సెలక్టివ్ గా వెళ్తున్నాడు.;
యంగ్ హీరో శ్రీ విష్ణు `సింగిల్` తో ఈ ఏడాది మంచి విజయాన్నే అందుకున్నాడు. దీంతో వచ్చిన సక్సెస్ క్రేజ్ ను మళ్లీ పట్టాలు తప్పకుండా సెలక్టివ్ గా వెళ్తున్నాడు. తొందర పడి కొత్త కథలకు కమిట్ అవ్వడం లేదు. స్టోరీల విష యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం `మృంత్యుంజయ` అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా క్లైమాక్స్ కు చేరుకుంది. పెండింగ్ షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది ఆరంభంలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే `కామ్రేడ్ కళ్యాణ్` అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదే రిలీజ్ అవ్వనుంది. అలా కొత్త ఏడాదిలో శ్రీవిష్ణు రెండు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో ప్రేక్షకుల్ని అలరించడం ఖాయం. అలాగే ఇంకొన్ని చిత్రాలు కూడా కమిట్ అయ్యాడు. ఆ సినిమాలు వచ్చే ఏడాది పట్టా లెక్కున్నాయి. `సామజవరగమన`తో హిట్ ఇచ్చిన రామ్ అబ్బరాజ్ తో మరోసారి కలిసి పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇందులో హీరోయిన్ కోసం పేరున్న నటిని పరిశీలిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని తెలి సింది. ఇదీ `సామజవరగమన` తరహాలోనే ఉంటుందని సమాచారం. అలాగే సుమంత్ హీరోగా నటించిన `అనగనగ` చిత్రాన్ని తెరకకెక్కించిన సన్నీ సంజయ్ తో కూడా శ్రీ విష్ణు ఓ చిత్రానికి కమిట్ అయ్యాడు. స్టోరీ నచ్చ డంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేసాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. 2026 ద్వితీయా ర్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే జీఏ2 బ్యానర్లో కూడా రెండవ సినిమాకు శ్రీవిష్ణు కమిట్ అయ్యాడు.
సింగిల్ ను అదే సంస్థ నిర్మించి హిట్ కొట్టడంతో? మరో సినిమాకు లాక్ చేసింది. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు శ్రీ విష్ణు పచ్చజెండా ఊపాడు. ఈసినిమా కూడా 2026లోనే ప్రారంభమవుతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి శ్రీవిష్ణు 2026 లో బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో ప్రేక్షకుల్లో ఉండటం ఖాయం. కొత్త ఏడాదిలోకి మరికొన్ని గంటల్లో అడుగు పెట్టబోతున్న తరుణంలో శ్రీవిష్ణు అభిమానులకు ఈ అప్ డేట్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు.