బంతి భోజనంలో ఆషికా రంగనాధ్!
అందులోనే ఓ స్టార్ హీరోయిన్ నలుగురితో బంతి భోజనం లో కూర్చిని భోజనం మరింత ఇంట్రెస్టింగ్;
ఒకప్పుడు తెలుగు లోగిళ్లలో బంతి భోజనాలే హైలైట్. వందమందికి ఒకేసారి ఆరిటాకులో పదార్దాలు, కుర్చీలు, టేబుళ్లు వేసి వడ్డించడం ఎంతో ప్రత్యేకంగా ఉండేది. కానీ తెలుగింట ఎక్కడా బంతి భోజనం కనిపించలేదు. అంతా బప్పెట్. ఈవెంట్ ఏదైనా బఫెట్ ఫాలో అవుతున్నారు. అయితే కన్నడ లో మాత్రం ఇప్పటికీ బంతి భోజనం స్టైల్ కొన సాగుతోంది. అదీ సామాన్య కుటుంబంలో కాదు. ఓ సెలబ్రిటీ కుటుంబం ఇంట బంతి భోజనం ఇప్పుడు హైలైట్ గా మారింది. అందులోనే ఓ స్టార్ హీరోయిన్ నలుగురితో బంతి భోజనం లో కూర్చిని భోజనం మరింత ఇంట్రెస్టింగ్
వివరాల్లోకి వెళ్తే..ఇటీవల ఆషీకా రంగనాధ్ తన సొంత ఊరిలో కుటుంబ వేడుకలో భాగంగా జరిగిన ఒక సంప్రదాయ విందులో పాల్గొంది. అక్కడ అందరితో కలిసి కింద కూర్చుని, అరటి ఆకులో వడ్డించిన బంతి భోజనాన్ని ఆమె ఎంతో ఇష్టంగా ఆస్వాదించింది. దానికి సంబంధించిన ఫోటోలను అమ్మడు తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసింది. అంతేనా ఆ పిక్ కు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. `పక్కా లోకల్.. బంతి భోజనం అంటే ఇష్టం` అంటూ రాసుకొచ్చింది. పట్టు పరికిణి ధరించి పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఆషీకా ముస్తాబైన వనం చూస్తే రెండు కళ్లు సరిపోవు.
ఎంత ఫ్యాషన్ వరల్డ్ లో ఉన్న సంప్రదాయాన్ని ఎంత మాత్రం మిస్ అవ్వలేదు. గ్లామరస్ హీరోయిన్‌గా కొనసాగుతున్నా? తన మూలాలను మర్చిపోకుండా ఇలా అందరితో కలిసి భోజనం చేయడంపై ఆమెలో నిరాడంబరతను తెలియజేస్తుంది. ఇలా బంతి భోజనం చేసింది ఆషీకా ఒక్కరే కాదండోయ్. సాయిపల్లవి, సమంత, కీర్తి సురేష్, అనుష్క శెట్టి , రష్మికా మందన్నా, నయనతార వంటి భామలు కూడా వివిధ సందర్భాల్లో బంతి భోజనాలు చేసిన బ్యూటీలే. అనుష్క, రష్మిక కన్నడ బ్యూటీలు కాబట్టి ఈ భోజనం గురించి వారికి అంత కొత్తగా అనిపించదు.
ఇంట్లో పండుగల సమయంలో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన సమయంలో సెలబ్రిటీలు ఎవరైనా సహజంగా బంతి భోజనాల్లో కనిపిస్తుంటారు. ఆషికా కెరీర్ విషయానికి వస్తే `నా సామిరంగ` విజయంతో వెలుగులోకి వచ్చిన బ్యూటీ కి ఇంకా అను కున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇటీవలే `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అంటూ ఓ చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం అనుకున్న విధంగా కనెక్ట్ అవ్వలేదు. ప్రస్తుతం చేతిలో ఉంది `విశ్వంభర`. అమ్మడి కెరీర్ లో ఇది పెద్ద ప్రాజెక్ట్ . సక్సెస్ అయితే కెరీర్ పరంగా కొంత వరకూ కలిసొస్తుంది.