ఈ ఛాలెంజ్ మహేష్.. ప్రభాస్ వరకు వస్తుందా?

Update: 2020-04-22 10:50 GMT
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఒక్కో సీజన్లో ఒక్కో ఛాలెంజ్ కు ఆదరణ దక్కుతుంది. ఈమధ్య పిల్లో ఛాలెంజ్ సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీలలో "బి ది రియల్ మాన్" ఛాలెంజ్ ఇప్పుడు ఓ ట్రెండ్ గా మారింది. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగ ఈ ఛాలెంజ్ ప్రారంభించాడు. ఇంటి పనుల్లో మహిళలకు సహాయపడాలి అంటూ సందీప్ తను ఇంటి పనులు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోతో రాజమౌళిని ఛాలెంజ్ చేసాడు.

ఇక జక్కన్న ఆ ఛాలెంజ్ ను విజయవంతంగా పూర్తి చేసి.. ప్రస్తుతం తన సినిమాలో నటిస్తున్న మెగా నందమూరి హీరోలు ఇద్దరికీ ఈ ఛాలెంజ్ విసిరాడు. అసలే ఎన్టీఆర్.. చరణ్ ఇద్దరు మాస్ హీరోలు... ఊరుకుంటారా? ఇంటి పనులు ఎడాపెడా చేసి ఆ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో పెట్టారు. ఎన్టీఆర్ నలుగురు సీనియర్ స్టార్స్ కు ఛాలెంజ్ విసిరాడు. ఇక ఛాలెంజ్ కు స్పందిస్తూ చిరంజీవి తన 'ఛాలెంజ్' సినిమా జిఐఎఫ్ ఇమేజ్ పోస్ట్ చేయడం విశేషం. అంతా బాగానే ఉంది కానీ టాలీవుడ్ లో కొందరు స్టార్ల వరకు ఈ ఛాలెంజ్ రాలేదు.

ప్రభాస్.. మహేష్ బాబు.. అల్లు అర్జున్ .. పవన్ కళ్యాణ్ లను ఇంతవరకూ ఎవరూ ఛాలెంజ్ చేయలేదు. ఛాలెంజ్ ఈమధ్య ప్రారంభం అయింది కాబట్టి ఈ స్టార్ హీరోల వరకు వచ్చేసరికి మరి కొంత సమయం పడుతుందేమో వేచి చూడాలి. ప్రభాస్.. మహేష్ బాబు ఇద్దరూ కొంచెం రిజర్వుడుగా ఉండే స్టార్ హీరోలు. మరి ఈ ఛాలెంజ్ ఒకవేళ వారి దగ్గరకు వస్తే యాక్సెప్ట్ చేస్తారా.. ఇంటి పనులు చేసి ఆ వీడియోని పెడతారా అనేది ఆసక్తికరం. మొత్తానికి మన టాలీవుడ్ స్టార్ లు లాక్ డౌన్ సమయంలో మహిళలకు సహాయం చేయండి అంటూ పురుష సమాజానికి ఇంటిపని సందేశం ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News