మహేష్ ఈసారైనా జనగనమణ పాడేనా?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. మహేష్ ల కాంబినేషన్ లో వచ్చిన పోకిరి చిత్రం సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత వచ్చిన బిజినెస్ మన్ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. మరోసారి వీరి కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితమే మహేష్ బాబుతో జనగనమణ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా పూరి ప్రకటించాడు.
పూరి వరుసగా ఫ్లాప్స్ చవిచూడటంతో పాటు స్క్రిప్ట్ విషయంలో మహేష్ బాబును సంతృప్తి పర్చలేక పోయాడు. ఆ కారణంగానే మహేష్ బాబు జనగనమణ ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ రెండు నెలల గ్యాప్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ జనగనమణ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశాడట. చాలా విభిన్నమైన స్క్రీన్ ప్లేతో అవినీతి బ్యాక్ డ్రాప్ గా సినిమా సాగనుందట.
మహేష్ బాబుకు స్క్రిప్ట్ వినిపించేందుకు ఎదురు చూస్తున్నట్లుగా దర్శకుడు పూరి తాజాగా సోషల్ మీడియా లైవ్ లో చెప్పుకొచ్చాడు. పూరి ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ ను దక్కించుకున్నాడు. విజయ్ దేవరకొండతో మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే వెంటనే మహేష్ డేట్లు పూరికి దక్కే అవకాశం ఉంది. పాన్ ఇండియా మూవీగా మహేష్ బాబుతో జనగనమణ చిత్రంను పూరి తెరకెక్కించే అవకాశం ఉందంటున్నారు.