జంగిల్ ఎంట్రీ వెనుక జ‌క్క‌న్న‌ మాస్టర్ ప్లాన్!

ఈ సీక్వెన్స్‌లో కెమెరాను మోయడానికి ఒక ప్రొఫెష నల్ పార్కర్ ఆర్టిస్ట్ ను రంగంలోకి దించారు.;

Update: 2026-04-26 23:30 GMT

ప్రపంచ సినిమా వేదికపై `ఆర్ఆర్ఆర్` సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినిమాలో ప్రతి సన్నివేశం ఓ అద్భుతమైతే కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అడవిలో పులితో తలపడే జంగిల్ ఎంట్రీ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ ఐకానిక్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి దర్శకుడు రాజమౌళి ఎంతటి శ్రమ కోర్చారో? ఎలాంటి సాంకేతికతను వాడారో? తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అడవిలో భీమ్ పరిగెడుతున్నప్పుడు కెమెరా కూడా అదే వేగంతో అడ్డంకులను దాటుకుంటూ భీమ్ పక్కనే ప్రయాణించాలి. సాధారణ కెమెరా మూమెంట్స్‌తో ఇది సాధ్యం కాదని గ్రహించిన రాజమౌళి వినూత్న ఆలోచన చేశారు.

ఈ సీక్వెన్స్‌లో కెమెరాను మోయడానికి ఒక ప్రొఫెష నల్ పార్కర్ ఆర్టిస్ట్ ను రంగంలోకి దించారు. పార్కర్ ఆర్టిస్టులు అత్యంత వేగంగా అడ్డంకులను దూకుతూ ప్రయాణించడంలో దిట్టలు. వారి సహాయంతోనే ఆ విజువల్స్ అద్భుతంగా వచ్చాయ‌న్నారు జ‌క్క‌న్న‌. `ఎన్టీఆర్ అడవిలోని పొదలు, చెట్ల మధ్య నుంచి వేగంగా పరిగెడుతుంటే? పార్కర్ ఆర్టిస్ట్ కెమెరాను ధరించి ఆయనకు సమాంతరంగా పరిగెత్తారు. సాధారణంగా ట్రాక్ మీద కెమెరా వెళ్తే వచ్చే ఆ స్మూత్ ఫీలింగ్ కంటే ఒక మనిషి పరిగెడుతూ తీయడం వల్ల వచ్చే ఆ జంకీ మూమెంట్ సీన్‌కు సహజత్వాన్ని ఇచ్చిందని రాజమౌళి తెలిపారు.

ప్రేక్షకులు కూడా తాము భీమ్ పక్కనే పరిగెడుతున్నామనే అనుభూతికి లోనవడానికి ఇదే ప్రధాన కారణం. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ అంకితభావం గురించి రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఆ సన్నివేశం కోసం ఎన్టీఆర్ చెప్పులు లేకుండా అడవిలో గంటల తరబడి పరిగెత్తాల్సి వచ్చింది. నేల మీద ఉన్న రాళ్లు, ముళ్లు గుచ్చుకున్నా లెక్కచేయకుండా భీమ్ పాత్రలోని ఆవేశాన్ని అద్భుతంగా పండించారు. నటుడి కష్టం, దర్శకుడి విజన్ , సాంకేతిక నిపుణుల సమన్వయం తోడవ్వడం వల్లే ఆ సీన్ వెండితెరపై విజువల్ వండర్‌గా హైలైట్ అయింది.

రాజమౌళి సినిమాల్లో టెక్నాలజీని వాడటమే కాదు. విజువల్స్‌లో సహజత్వం కోసం ఫిజికల్ ఎఫర్ట్స్‌కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పార్కర్ ఆర్టిస్టును వాడటం అనేది టాలీవుడ్ లో ఓ కొత్త ప్రయోగమని చెప్పాలి. ఈ చిన్న టెక్నిక్ వల్ల ఆ సీన్ ఎమోషన్ , వేగం ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టింది. అందుకే హాలీవుడ్ దర్శకులు సైతం రాజమౌళి మేకింగ్ స్టైల్ ను చూసి ఆశ్చర్యపోతుంటారన్న‌ది కాద‌న‌లేని నిజం. `ఆర్ఆర్ఆర్` విజయం వెనుక ఇలాంటి వేల మంది టెక్నీషియన్ల కృషి , రాజమౌళి మేధస్సు ఉన్నాయి.

సాధారణ పరుగు పందెం లాంటి సీన్‌ను కూడా పార్కర్ ఆర్టిస్ట్ సహాయంతో అసాధారణంగా మార్చడం రాజమౌళికే చెల్లింది. జూనియర్ ఎన్టీఆర్ స్టామినా , రాజమౌళి సృజనాత్మకత కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడమే కాదు. ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా భార‌తీయ జెండా రెప‌రెప‌లాడుతుంద‌ని సినిమా నిరూపించింది.

Tags:    

Similar News