విల‌క్ష‌ణ న‌టుడి ఎఫైర్స్ త‌ట్టుకోలేక‌ భార్య విడాకులు..!

Update: 2020-12-13 04:10 GMT
బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. త‌న‌దైన విల‌క్ష‌ణ అభిన‌యంతో జాతీయ ఉత్త‌మ న‌టుడిగా ఎంతో మంది ప్ర‌శంస‌లు అందుకున్నారు. అయితే వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగా మాత్రం విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. గ‌త కొంత‌ కాలంగా ఎఫైర్ ‌ల కార‌ణంగా  న‌వాజుద్దీన్ సిద్ధిఖీ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఈ వివాదాల కార‌ణంగానే  న‌వాజుద్దీన్ సిద్ధిఖీ త‌న భార్య అలియాతో విడిపోతున్నార‌ట‌.

వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. అయితే వ‌రుస ఎఫైర్ ల కార‌ణంగా న‌వాజుద్దీన్ సిద్ధిఖీ భార్య అలియా విడిపోవాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఇందు కోసం విడాకులు తీసుకోవాల‌ని కోర్టుని కూడా ఆశ్ర‌యించిన‌ట్టు తెలుస్తోంది. కోర్టులో వీరి పిటీష‌న్ ఫైన‌ల్ స్టేజ్ ‌కి వ‌చ్చింద‌ని త్వ‌ర‌లోనే వీరు విడిపోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఇదిలా వుంటే న‌వాజుద్దీన్ సిద్ధిఖీ త‌న భార్య అలియాకు ట్విస్ట్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. విపోయిన త‌రువాత త‌న ఇద్ద‌రు పిల్ల‌లు షోరా యానీ త‌న‌తోనే వుండాల‌ని ఫ్యామిలీ కోర్టులో అప్పీలు చేయ‌బోతున్నార‌ట‌. అయితే ఇందుకు అలియా అంగీక‌రించేలా క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. న‌వాజుద్దీన్ సిద్ధిఖీ తాజా అప్పీల్ తో విడాకుల వివాదం మ‌ళ్లీ మొద‌టి వ‌చ్చేలా వుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News