ప‌వ‌న్ అంత స్పెష‌లైతే రావాలి క‌ద‌మ్మా..

Update: 2017-03-19 17:16 GMT
శ్రుతి హాసన్ దగ్గరికెళ్లి ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చినా చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. కెరీర్ ఆరంభంలో వరుస ఫ్లాపులు ఎదురవడంతో తనను అందరూ ఐరెన్ లెగ్ అంటున్న సమయంలో ‘గబ్బర్ సింగ్’లో తనతో జత కట్టడానికి ఒప్పుకున్నాడని.. ఆ సినిమా హిట్టయి తాను గోల్డెన్ లెగ్ అయిపోయానని.. ఒకప్పుడు తనను వద్దన్న వాళ్లే ఇప్పుడు తనే కావాలంటున్నారని.. ఇదంతా పవన్ పుణ్యమే అని.. ఆయన తనకు చాలా స్పెషల్ అని ఈ మధ్య కూడా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది శ్రుతి. పవన్ తో కలిసి రెండోసారి నటిస్తున్న ‘కాటమరాయుడు’ కూడా తనకు చాలా ప్రత్యేకమనే చెప్పిందామె. ఐతే పవన్ అంత స్పెషల్ అన్న శ్రుతి ‘కాటమరాయుడు’ ప్రి రిలీజ్ ఈవెంట్ కు మాత్రం రాలేదు.

బిజీగా ఉండ‌టం వ‌ల్ల కాట‌మ‌రాయుడు ఆడియో వేడుక‌కు రాలేక‌పోతున్న‌ట్లు శ్రుతి ముందే ట్విట్ట‌ర్లో చెప్పింది. కానీ ఎలాంటి క‌మిట్మెంట్లున్నా శ్రుతి ఈ వేడుకకు రావాల్సింద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. మిగతా సినిమాల మాదిరి పవన్ సినిమాలకు మీడియాను కలిసి ఇంటర్వ్యూలిస్తూ ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆడియో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ కు వస్తే చాలు. కానీ శ్రుతి అలా చేయలేదు.  రావాలని ఫిక్సయి ఉంటే ఎలాగైనా రావ‌చ్చ‌ని..  ముందుగానే దానికి త‌గ్గ‌ట్లు ప్లాన్ చేసుకోవాల్సింద‌ని.. మిగతా వేడుకల మాటేమో కానీ.. పవన్ చాలా స్పెష‌ల్ కాబ‌ట్టి కాట‌మ‌రాయుడు వేడుకకు మాత్రం రావాల్సిందని.. ఆమె వస్తే ఈ వేడుక మరింత ఆకర్షణీయంగా ఉండేదని అంటున్నారు టాలీవుడ్ జనాలు.
Tags:    

Similar News