సూపర్ స్టార్ ను ఢీ కొట్టేది ఎవరనేది ఇప్పుడు చెప్పరట
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్ ఇప్పట్లో మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. కరోనా ఉదృతి కాస్త అయినా తగ్గే వరకు వెయిట్ చేయాలని మహేష్ అండ్ టీం భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది. షూటింగ్ ప్రారంభంకు చాలా సమయం ఉంది కనుక ఇతర నటీనటుల విషయంలో ప్రస్తుతం చర్చలు జరపడటం లేదట.
మొన్నటి వరకు ఈ చిత్రంలో నటించబోతున్న హీరోయిన్ ఎవరు అనే విషయమై సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. సినిమా ప్రారంభంకు సమయం ఉంది కనుక హీరోయిన్ విషయంలో ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదని యూనిట్ సభ్యులు అనధికారికంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు విలన్ విషయంలో కూడా అదే హడావుడి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అరవింద్ స్వామి.. ఉపేంద్ర.. సుదీప్ లతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
హీరోయిన్ మాదిరిగానే విలన్ పాత్రకు కూడా నటుడిని ఇప్పుడే ఖరారు చేసే ఉద్దేశ్యంలో లేరట. షూటింగ్ ప్రారంభించేది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కనుక షూటింగ్ ప్రారంభం సమయంలోనే విలన్ పాత్రకు గాను నటుడిని ఎంపిక చేయాలని.. ఇప్పుడే ఎంపిక చేస్తే ఆ తర్వాత డేట్ల విషయంలో కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. పారితోషికంగా కూడా అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుందని అందుకే కాస్త ఆలస్యంగానే విలన్ ను ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారట.