బీ సీ సెంటర్లలో పట్టు పెంచుకుంటే నాని టైర్ 1 కు!

Update: 2020-04-24 05:30 GMT
హీరోల సత్తాకు ఒకటే కొలమానం.. అవే కలెక్షన్లు.  ఎందుకంటే ఒక సినిమా విజయం సాధించిందా లేదా అనేది కలెక్షన్ల ద్వారానే తెలుసుకోవచ్చు.  గత సినిమాల స్థాయిని బట్టే ఒక హీరో కొత్త సినిమాకు బిజినెస్ జరుగుతుంది. ఏ హీరో కూడా దీనికి మినహాయింపు కాదు. మిడ్ రేంజ్ హీరోలలో మంచి గుర్తింపు.. ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నహీరో న్యాచురల్ స్టార్ నాని. అయితే నాని మొదటి నుంచి టైర్ 2 హీరోగానే ఉన్నాడు కానీ టైర్ 1 కు చేరలేకపోతున్నాడు. మరి ఎక్కడ తేడా కొడుతోంది?

అసలు నాని రేంజ్ ఎంతో.. మార్కెట్ స్టామినా ఎంతో చూడాలంటే నాని నటించిన గత 5 సినిమాల కలెక్షన్స్ లిస్టు పరిశీలించాలి.

నిన్ను కోరి: 28.56 cr
ఎమ్ సి ఏ: 41 cr
కృష్ణార్జున యుద్ధం: 14 cr
జెర్సీ: 28 cr
గ్యాంగ్ లీడ‌ర్: 23 cr

ఈ లెక్కల్ని మనం ఒకసారి గమనించి చూస్తే నాని మాస్ టచ్ ఇచ్చిన సినిమాల్లో ఒకటి డిజాస్టర్ అయితే మరొకటి బ్లాక్ బస్టర్ అయింది. 'MCA' అన్ని సెక్షన్లను ఆకట్టుకునే సినిమానే కానీ అందులో సాయి పల్లవికి 50% క్రెడిట్ ఉంటుంది. ఇక 'నిన్నుకోరి'.. 'MCA' తప్ప మిగతా సినిమాలేవీ బీ.. సి సెంటర్లలో ఆడలేదు. దీనర్థం నాని బీ.. సి సెంటర్ల ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు.  టైర్ 1 హీరో అవ్వాలంటే ఈ ప్రేక్షకుల మద్దతు ఎక్కువ అవసరం.

అది జరగాలంటే నాని ఓ మాస్ కథకు తన యాక్టింగ్ స్కిల్స్ జోడించి బీ..సీ సెంటర్ల ప్రేక్షకుల్లోకి చొచ్చుకు పోవాలి.  అంటే 'భలే భలే మగాడివోయ్' లాంటి సినిమాలు పడితేనే అది సాధ్యం అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
Tags:    

Similar News