కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్!
కోలీవుడ్ మ్యాచో మ్యాన్, ఒకప్పటి క్రేజీ యాక్షన్ హీరో శరత్‌కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్. కోలీవుడ్‌లో ఆయన నట వారసురాలిగా `పొడా పొడి` సినిమాతో అరంగేట్రం చేసి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది.;
కోలీవుడ్ మ్యాచో మ్యాన్, ఒకప్పటి క్రేజీ యాక్షన్ హీరో శరత్‌కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్. కోలీవుడ్‌లో ఆయన నట వారసురాలిగా `పొడా పొడి` సినిమాతో అరంగేట్రం చేసి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత కన్నడ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా క్రేజీ స్టార్లతో కలిసి నటించింది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం హీరోయిన్‌గా అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. కమర్షియల్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకోలేకపోయింది.
విశాత్ నటించిన `పందెంకోడి 2` సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోకు తగ్గ ప్రాధాన్యత ఉన్న నెగెటివ్ పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, మరో పక్క క్యారెక్టర్ ప్రధాన చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. అదే సమయంలో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన `క్రాక్`లో జయమ్మగా నటించింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సక్సెస్‌ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈ మూవీతో జయమ్మగా వరలక్ష్మికి మంచి మార్కులు పడ్డాయి. ప్రముఖ స్టార్లు సైతం తన క్యారెక్టర్‌ని చూసి ప్రశంసలు కురిపించడంతో సరికొత్త క్యారెక్టర్‌లలో నటించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం డైరెక్టర్‌గా మారి `స్రవంతి` మూవీని నిర్మిస్తూ, పటిస్తూ రూపొందిస్తోంది. ప్రియమణి, కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్‌ని శనివారం రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమానికి దర్శకుడు గోపీచంద్ మలినేనిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి మాట్లాడుతూ `గోపీ సార్ నా స్నేహితుడు, గురువు, నా మెంటర్..తను నా లైఫ్‌ని తెలుగు సినిమాతో రీలాంచ్ చేశాడు. ఎప్పటికీ ఆయనని అభిమానిస్తూనే ఉంటాను. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఆయన నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు` అంటూ భావోద్వేగానికి లోనై స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంతే కాకుండా తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని, ఈ సినిమాని చాలా బాగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. ఇండస్ట్రీలో మహిళలు పెరగాలి. తమన్, మహేంద్ర లాంటి వాళ్లు అంతా నా వెనకుండి నడిపించారన్నారు. `క్రాక్`లో వరలక్ష్మీ శరత్‌కుమార్ జయమ్మగా నటించి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసి మెగాస్టార్ కూడా తనని అభినందించారు. ఈ క్యారెక్టరే తనకు తెలుగులో మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది. ఇప్పడు డైరెక్టర్‌గా మరో అడుగు వేస్తోంది.