హీరోలకు ఫ్లాప్ తర్వాత ఛాన్స్.. హీరోయిన్లకు మాత్రం ఎందుకు కష్టం?
ఇదే విషయాన్ని తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ ఎగ్జాంపుల్ గా సినీ ప్రియులు చెబుతున్నారు. వరుస విజయాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఒక హీరో సినిమా ఫ్లాప్ అయితే.. తర్వాతి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడనే నమ్మకం ఇండస్ట్రీలో కనిపిస్తుంది. కానీ ఒక హీరోయిన్ కు వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన రిజల్ట్స్ ఇవ్వకపోతే.. అవకాశాల లెక్కలు వెంటనే మారిపోతాయి. ఇదే సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల కెరీర్ల మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
సినిమా విజయం అనేది ఒక్కరి చేతుల్లో ఉండదు. కథ, దర్శకుడు, నిర్మాణం, మార్కెటింగ్, ప్రేక్షకుల రెస్పాన్స్.. ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రిజల్ట్ ను నిర్ణయిస్తాయి. అయినప్పటికీ మూవీ రిజల్ట్ ఎఫెక్ట్ హీరోల కంటే హీరోయిన్లపై ఎక్కువగా పడుతుందనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. హీరోల విషయంలో ఒక సినిమా ఫ్లాప్ అయినా.. వారి స్టార్ ఇమేజ్, ఫ్యాన్ బేస్, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు మళ్లీ అవకాశాలు ఇస్తుంటారు.
గతంలో భారీ డిజాస్టర్లు ఎదుర్కొన్న చాలామంది హీరోలు ఆ తర్వాత బ్లాక్ బస్టర్లతో తిరిగి తమ ప్లేస్ ను నిలబెట్టుకున్నారు. హీరోల కెరీర్ కు ఎక్కువ సమయం, ఎక్కువ ఛాన్సులు వస్తాయనే ఫీలింగ్ ఉంది. కానీ హీరోయిన్ల విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఒక హీరోయిన్ వరుసగా విజయాలు అందుకుంటేనే మార్కెట్ లో డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో వరుసగా సినిమాలు నిరాశపరిస్తే ఛాన్సులు తగ్గే అవకాశం ఉంటుంది.
దీనికి ప్రధాన కారణం ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉన్న పోటీ కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రతి సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో కొత్తదనం, మార్కెట్ రీచ్, సోషల్ మీడియా క్రేజ్, ప్రేక్షకుల కనెక్షన్ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు హీరోయిన్ల కెరీర్ లో సరైన సినిమా సెలక్షన్ కీలకంగా మారింది. ఒక మంచి కథలో భాగం కావడం కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. స్ట్రాంగ్ కంటెంట్ లేని సినిమాలు వరుసగా వస్తే దాని ఎఫెక్ట్ హీరోయిన్ ఇమేజ్ పై పడుతుంది.
అందుకే హీరోయిన్లు ఇప్పుడు గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. వాళ్లలో చాలా మంది ఒక దశలో వరుస విజయాలతో టాప్ లో ఉన్నప్పటికీ.. తర్వాత సరైన సినిమాలు లేక కెరీర్ లో అప్స్, డౌన్స్ చూశారు. అయితే మంచి ఛాన్స్ దొరికితే మళ్లీ పుంజుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ ఎగ్జాంపుల్ గా సినీ ప్రియులు చెబుతున్నారు. వరుస విజయాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కెరీర్ పై చర్చ మొదలైంది. రీసెంట్ గా జననాయగన్ కూడా ఆమెకు కలసిరాలేదు. అయితే పూజకు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో అందరికీ టాలెంట్ తోపాటు సరైన సమయం, సరైన కథ, సరైన అవకాశం కూడా కెరీర్ ను నిర్ణయించే కీలక అంశాలుగా మారుతున్నాయి. హీరోలకు దక్కే కంబ్యాక్ ఛాన్సులు హీరోయిన్లకు కూడా సమానంగా దక్కితే మరిన్ని కెరీర్స్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.