బిగ్ బ్లాస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో కమల్ హాసన్ రజనీకాంత్!
ఇప్పుడు అదే మేజిక్ జరగబోతోంది. దానికి సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.;
ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. దశాబ్దాలుగా అభిమానులు కంటున్న ఒక అద్భుతమైన కల ఇప్పుడు నిజం కాబోతోంది. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు లెజెండరీ సూపర్ స్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. ఇప్పుడు అదే మేజిక్ జరగబోతోంది. దానికి సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
దాదాపు 47 ఏళ్ల తర్వాత లోకనాయకన్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్ళీ కలిసి నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మెగా ప్రాజెక్టుకు ప్రస్తుతం #KHxRK అని వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటేనే పూనకాలు వచ్చేస్తున్నాయి.
ఈ వీడియోలో ఇద్దరు స్టార్లు తమదైన క్లాస్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు.
ఒక గ్యారేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కమల్ హాసన్, రజనీకాంత్ నడుచుకుంటూ వస్తుంటే వచ్చే ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ తనదైన స్టైల్లో సన్ గ్లాసెస్ పెట్టుకోవడం, కమల్ హాసన్ చాలా సీరియస్ గా చూస్తూ నడవడం చూస్తుంటేనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది. ఇద్దరూ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ సూట్లలో చాలా స్టైలిష్ గా మెరిసిపోయారు.
వీడియోలో నెల్సన్ కూడా ఒక వెరైటీ ఎలిమెంట్ తో సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక కారులో వెళ్తున్న కమల్, రజనీలు అనిరుద్ నెల్సన్ ని చూస్తూ "ఎవరు హీరో?" అని అడగడం ఆకట్టుకుంది. దీనికి రజనీకాంత్ తనదైన మార్క్ నవ్వుతో రియాక్ట్ అవ్వడం అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటం మరో మేజర్ హైలైట్. ఇప్పటికే తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో అనిరుధ్ ఈ అనౌన్స్‌మెంట్ వీడియోను మరో లెవల్ కి తీసుకెళ్లారు.
ఈ కాంబినేషన్ సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నెల్సన్ ఈ స్క్రిప్ట్ ని చాలా పక్కాగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు లెజెండ్స్ మధ్య ఫ్యాన్ వార్స్ కి తావు లేకుండా ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఉండేలా కథను రూపొందించారట. లేటెస్ట్ టెక్నాలజీతో, హాలీవుడ్ మేకింగ్ స్టైల్ తో ఈ సినిమా ఉండబోతోందని వీడియో చూస్తే అర్థమవుతోంది. నేటి తరం ఆడియన్స్ కి కూడా నచ్చేలా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండటంతో సినిమా అంచనాలు హై రేంజ్ లో ఉంటాయి. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్లను చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఇది కచ్చితంగా ఐ ఫీస్ట్ అని చెప్పాలి.