ఫిబ్ర‌వ‌రి 22 కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ వెయిటింగ్.. ఎందుకంటే?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి హీరోకు తనదైన ప్రత్యేకత ఉంటుంది. స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ ఇవ‌న్నీ కలిపి ఒక స్టార్ ఇమేజ్‌ను నిర్మిస్తాయి.;

Update: 2026-02-21 07:03 GMT

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి హీరోకు తనదైన ప్రత్యేకత ఉంటుంది. స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ ఇవ‌న్నీ కలిపి ఒక స్టార్ ఇమేజ్‌ను నిర్మిస్తాయి. అలా తన ప్రత్యేకమైన మ్యానరిజమ్స్‌తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న‌ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయన పేరు వినగానే అభిమానుల కళ్లముందు ఒక సిగ్నేచర్ స్టైల్ క‌నిపిస్తోంది. అదే మెడ మీద చెయ్యి పెట్టుకునే మ్యానరిజమ్.

ప‌వ‌న్ మ్యాన‌రిజ‌మ్ ఫ్యాన్స్ కు ఎమోష‌న్

ఈ స్టైల్ జ‌స్ట్ ఒక‌ యాక్షన్ కాదు, ఫ్యాన్స్ కు అదొక ఎమోష‌న్. ఎన్నో సినిమాల్లోప‌వ‌న్ చేసిన ఈ మ్యానరిజమ్‌కు స్పెష‌ల్ ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలోనూ, కాలేజీ ఈవెంట్స్‌లోనూ, పబ్లిక్ గ్యాదరింగ్స్‌లోనూ ఈ స్టైల్‌ను అనుకరించే అభిమానులు లక్షల్లో ఉంటారు. అయితే ఈ మ్యానరిజమ్ వెనుక అసలు అర్థం ఏమిటి? అది కేవలం స్టైల్ కోసమా, లేక దాని వెనుక ఇంకేదైనా కథ ఉందా? అనే ప్రశ్నలు చాలా కాలంగా అభిమానులను వెంటాడుతున్నాయి.

మ్యాన‌రిజ‌మ్ డీకోడ్ చేయ‌బోతున్న హ‌రీష్ శంక‌ర్

ఈ సందేహాలకు ఇప్పుడు సమాధానం దొరకబోతోంది. ఫిబ్రవరి 22న మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో ఈ మ్యానరిజమ్‌ను డీకోడ్ చేయనున్నట్లు డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాను హరీష్ శంకర్, ఈ మ్యానరిజమ్ వెనుక అర్థం, దాని ఉద్దేశ్యం, అస‌లు అదెలా వ‌చ్చింది లాంటి అంశాలను ఆ రోజు వెల్లడించనున్నట్లు ఎక్స్ వేదికగా ఓ వీడియో ద్వారా తెలియజేశారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ పై భారీ అంచ‌నాలు

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే ఆడియ‌న్స్ లో ప్రత్యేకమైన అంచనాలుంటాయి. గతంలో వీరి కలయికలో వచ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిల‌వ‌గా, ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్లో సినిమా రానుండ‌టంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ హైప్ ఏర్పడింది. ఆ హైప్ కు త‌గ్గ‌ట్టుగానే ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ దేఖ్‌లేంగే సాలా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇప్పుడు రెండో పాట ఆరా ఆఫ్ ఉస్తాద్ ను ఫిబ్రవరి 22 సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫిబ్ర‌వ‌రి 26న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై ఎన్నో అంచ‌నాలుండ‌గా, పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకునేందుకు ఇప్పుడంద‌రి దృష్టి ఫిబ్రవరి 22పై ఉంది.



Tags:    

Similar News