అల్లు వారింట పెళ్లి బాజాలు.. ఫోటోలో మెగా అల్లు యూనిటీ చూశారా!
తమ్ముడి పెళ్లిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రీసెంట్‌గా ఒక క్రేజీ ప్రీ వెడ్డింగ్ పార్టీని కూడా హోస్ట్ చేశారు.;
మెగా, అల్లు ఫ్యామిలీస్ లో ఏ చిన్న ఈవెంట్ జరిగినా అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలవ్వడంతో హడావుడి మామూలుగా లేదు. టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ వెడ్డింగ్స్ లో ఒకటిగా నిలిచిన ఈ వేడుకకు సంబంధించి ప్రతి అప్‌డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇప్పటికే వెడ్డింగ్ కార్డుల పంపిణీతో పాటు సెలబ్రేషన్స్ కూడా పీక్స్ కి చేరుకున్నాయి.
అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేమించిన నయనికతో కలిసి మార్చి 6న పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడన్న వార్త ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. తమ్ముడి పెళ్లిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రీసెంట్‌గా ఒక క్రేజీ ప్రీ వెడ్డింగ్ పార్టీని కూడా హోస్ట్ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో బయటకు రావడంతో మెగా అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆ ఫోటోలో అల్లు శిరీష్ నయనిక జంటతో పాటు అల్లు అర్జున్ స్నేహారెడ్డి, రామ్ చరణ్ ఉపాసన ఒకే ఫ్రేమ్‌లో మెరిసిపోయారు. ఈ వేడుకకు వచ్చిన వారంతా బ్లాక్ డ్రెస్ కోడ్‌లో కనిపించడం విశేషం. అందరూ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుంటే, రామ్ చరణ్ మాత్రం అయ్యప్ప మాల ధరించి నల్లటి దుస్తుల్లో చాలా సింపుల్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. చరణ్ తన బిజీ షెడ్యూల్ లో కూడా మాల వేసుకుని ఇలా వేడుకకు రావడంపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మెగా అల్లు యూనిటీ నెక్స్ట్ లెవల్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చరణ్, బన్నీ ఇద్దరూ తమ బిజీ షూటింగ్స్ పక్కన పెట్టి మరి తమ్ముడి కోసం ఇలా సమయం కేటాయించడం చూస్తుంటే వారి మధ్య ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతోంది. మొత్తానికి ఈ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో ఉన్న రూమర్లన్నింటికీ చెక్ పడిందని చెప్పొచ్చు.
ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే, గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నా, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ లో కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారు. మార్చి 6న జరగబోయే ఈ పెళ్లి వేడుకకు సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనే ఒక భారీ వేదికపై ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరగబోతోందని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండగా, అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట కనిపించడంతో అటు 'పెద్ది' ఇటు 'బన్నీ అట్లీ' ప్రాజెక్టుల మీద కూడా ఒక్కసారిగా హైప్ పెరిగింది.