'టాక్సిక్'లో బిగ్ స‌ర్‌ప్రైజ్‌..'యానిమ‌ల్' సీనేనా?

దేశ వ్యాప్తంగా భారీ హైప్‌ని సొంతం చేసుకున్న సినిమాల్లో రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయకుడిగా న‌టిస్తున్న 'టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ - అప్స్‌' ఒక‌టి.;

Update: 2026-02-21 06:30 GMT

దేశ వ్యాప్తంగా భారీ హైప్‌ని సొంతం చేసుకున్న సినిమాల్లో రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయకుడిగా న‌టిస్తున్న 'టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ - అప్స్‌' ఒక‌టి. మ‌లమాళ న‌టి, డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ ఈ మూవీని హాలీవుడ్ యాక్ష‌న్ సినిమాల ఏమాత్రం తీసిపోని స్థాయిలో తెర‌కెక్కించింది. 'కేజీఎఫ్' సిరీస్‌ సినిమాల త‌రువాత య‌ష్ నుంచి వ‌స్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా కావ‌డం, టెక్నిక‌ల్‌గానూ హై స్టాడ‌ర్డ్స్‌లో తీసిన సినిమా కావ‌డంతో దీని కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

కేవీఎప్ ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి హీరో య‌ష్ ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాడు. ఫ‌స్ట్ టీజ‌ర్‌తోనే దేశ వ్యాప్తంగా ర‌చ్చ‌కు తెర‌లేపారు. సెన్సార్ వ‌ర్గాల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో ప్ర‌ధాన అధికారి టీజ‌ర్‌ల‌కు సెన్సార్ ఉండ‌ద‌ని, ఆ విష‌యంలో మ‌మ్మ‌ల్ని నిందించొద్ద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. రిలీజ్‌కు ముందు వివాదాల‌కు తెర‌లేపిన ఈ మూవీలో కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో క్రేజీ భామ‌లు న‌య‌న‌తార‌, , హ్యూమ ఖురేషీ, రుక్మిణీ వ‌సంత్‌, తారా సుతారియా క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నారు.

ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మ‌ల‌యాళ హీరో టొవినో థామ‌స్‌, అక్ష‌య్ ఓబెరాయ్‌, డారెల్ డిసిల్వా, సుదేవ్ నాయ‌ర్‌, అమిత్ తివారీ న‌టిస్తున్నారు. మార్చి 19న ఇంగ్లీష్ వెర్ష‌న్‌తో పాటు క‌న్న‌డ‌, తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలోనే ఈ మూవీ టీజ‌ర్‌ని మేక‌ర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సారి యుద్దం వేరు..వాళ్ల కుతంత్రాలు వేరు. అంద‌రితో విరోధం పెట్టుకుని బ్ర‌త‌క‌లేం` అంటూ య‌ష్ చెప్పే డైలాగ్‌లు, ధురంధ‌ర్‌, మార్కో స్థాయి హార్డ్ కోర్ వ‌యోలెన్స్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచేసింది.

టీజ‌ర్ ఆద్యంతం ర‌క్త‌పాతంతో సాగి అంద‌రిని షాక్‌కు గురి చేసింది. 1970లో గోవాలో జ‌రిగిన డ్రగ్ మాఫియా, అండ‌ర్ వ‌రల్డ్ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ డ్రామా ఇది. అత్యంత క్రూరుడైన రాయ అనే గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా దీన్ని తెర‌కెక్కించారు. గ్యాంగ్ స్ట‌ర్‌ రాయగా య‌ష్ అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. మేక‌ర్స్ కూడా ఇంత వ‌ర‌కే ఇప్ప‌టి వ‌ర‌కు రివీల్ చేస్తూ వ‌చ్చారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన టీజ‌ర్‌ని నిశితంగా గ‌మ‌నిస్తే షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

సినిమాలో య‌ష్ ఒకే ఒక్క క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌డం లేద‌ని, డ్యుయెల్ రోల్‌లో క‌నిపిస్తున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ఇందులో య‌ష్ మ‌రో రూత్‌లెస్ క్యారెక్ట‌ర్ లో క‌నిపించి భ‌య‌పెట్ట‌బోతున్నాడు. అదే `రూమి`. చాలా యంగ్‌గా క‌నిపించే ఈ క్యారెక్ట‌ర్ సినిమాలో ఒళ్లు గ‌గుర్పొడిచే యాక్ష‌న్ సీక్వెన్స్ చేసిన‌ట్టుగా టీజ‌ర్‌లో చూపించారు. ఎక్క‌డా య‌ష్ ఫేస్ కినిపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డినా ఐస్ త‌న‌ని ప‌ట్టించాయి. ప‌దేళ్ల క్రితం య‌ష్ ఎలా ఉండేవాడో అదే త‌ర‌హాలో ఈ రూమి క్యారెక్ట‌ర్ క‌నిపిస్తోంది. ఈ క్యారెక్ట‌ర్ అత్యంత దారుణంగా ఉంటుంద‌ని టీజ‌ర్ ఎండ్‌లో చూపించిన మ‌ర్డ‌ర్స్ స్ప‌ష్టం చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యానిమ‌ల్ ఎండ్‌లో క‌నిపించే అజీజ్ హ‌క్ క్యారెక్ట‌ర్‌ని పోలి ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ క్యారెక్ట‌ర్‌తో య‌ష్ త‌న అభిమానుల్ని షాక్‌కు గురి చేస్తూనే స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News