ట్రైలర్ టాక్:వరు ఫస్ట్ అటెమ్ట్‌తో సక్సెస్ కొట్టేలా ఉందే!
వరలక్ష్మీ శరత్ కుమార్.. హీరోయిన్‌గా నాలుగు భాషల్లో నటించి ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.;
వరలక్ష్మీ శరత్ కుమార్.. హీరోయిన్‌గా నాలుగు భాషల్లో నటించి ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించిన `క్రాక్` మూవీలో జయమ్మగా తనదైన మార్కు నటనతో ఆకట్టుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి సినిమాతో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా ప్రముఖుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది. కోలీవుడ్ ఒకప్పటి స్టార్ శరత్ కుమార్ ముద్దు కూతురిగా అరంగేట్రం చేసినా తనకంటూ ప్రత్యేకతని చాటకుంది.
ఇప్పుడు డైరెక్టర్‌గా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త జర్నీకి శ్రీకారం చుట్టింది. వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ `సరస్వతి`. ప్రియమణి, కన్నడ నటుడు కిషోర్, ప్రకాష్ రాజ్, మురళీశర్మ, రావు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 21 శనివారం ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.
`సరస్వతి` అనే పాప మిస్సింగ్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. `సరస్వతి` అనే అమ్మాయి స్కూల్‌కి వెళ్లి కనిపించకుండా పోతుంది. తన కోసం తల్లి వెతకడం మొదలు పెడుతుంది. `నా కూతుర్ని పొద్దున స్కూల్లో నేనే డ్రాప్ చేశాను. ఇప్పుడేమో తనని పికప్ చేసుకోవడానికి వస్తే నా కూతురే ఇక్కడ లేదని చెబుతున్నారు` అంటూ వరలక్ష్మి చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఇదే తరహాలో ప్రియమణి తన పాప కోసం ఆరాతీయడం, తను కూడా మిస్సవ్వడం చూపించారు.
వీరిద్దరూ తమ తమ పాపల కోసం వెతకడం, పోలీస్టేషన్‌ల చుట్టూ తిరగడం మొదలు పెడతారు. అసలు ఈ పాప ఎవరో తమకు తెలియదని స్కూల్ పిల్లలు చెప్పడంతో టెన్షన్ మొదలవుతుంది. ఇంతకీ సరస్వతి ఎవరు? ఎందుకు స్కూల్ నుంచి మిస్సయింది? ఆ మిస్సింగ్ వెనక ఎవరున్నారు? వంటి ఆసక్తికరమైన అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. `అపాయింట్ మెంట్ లేకుండా నేను ఎవరినీ కలవనని తెలియదా` అంటూ పేరు మోసిన లాయర్‌గా ప్రకాష్ రాజు, అతన్ని డిఫైన్ చేసే లాయర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ కనిపిస్తున్నారు.
ఓ పాప నేపథ్యంలో సాగే కోర్ట్ రూమ్ డ్రామాగా దీన్ని వరలక్ష్మీ శరత్ కుమార్ ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించింది. ట్రైలర్ చివర్లో `ప్రతీ అమ్మాయి ఒక సరస్వతిలా ఉండదు. అవసరమైతే కాళిలా కూడా మారుతుంది` అని శరలక్ష్మీ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ బలమైన కథతో అంతకు మించిన బలమైన సందేశాన్ని ఈ సినిమాతో అందిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, ఓ కూతురి కోసం అమ్మ పడే తపన, చట్టాలు ఏమీ చేయలేకపోవడంతో స్వయంగా తానే రంగంలోకి దిగిన తీరు ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. చూస్తుంటే వరు ఫస్ట్ అటెమ్ట్‌తో డైరెక్టర్‌గా సక్సెస్ కొట్టేలా కనిపిస్తోంది.