జైలు నుంచి వచ్చాక పూరీ హీరోయిన్ ఏం చేస్తోంది..?
శాండిల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ లో హీరోయిన్ సంజన గల్రానీ ని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'బుజ్జిగాడు' సినిమాలో సంజన సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో 'యమహా యమా' 'ముగ్గురు' 'సర్ధార్ గబ్బర్ సింగ్' వంటి సినిమాలలో కనిపించింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత సంజన పై అనేక ఆరోపణలు వచ్చాయి. అక్రమాస్తులు ఉన్నాయని.. డ్రగ్ దందాతో పాటు క్రికెట్ బెట్టింగ్స్ కూడా నిర్వహించేదని.. పలు రాజకీయ నాయకులకు బినామీగా కూడా ఉందని కన్నడ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే అనేక పరిణామాల తర్వాత సంజన గత ఏడాది డిసెంబర్ 13న బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చింది.
సంజన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చాలా ఎమోషనల్ అయ్యిందని తెలుస్తోంది. తనను అన్యాయంగా ఈ డ్రగ్స్ కేసులలో ఇరికించారని.. కావాలనే తనను టార్గెట్ చేశారని ఆమె సన్నిహితుల దగ్గర వాపోయిందట. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి అందరికీ దూరంగా ఉంటూ ఒంటరిగా గడిపిన సంజన ఇప్పుడు మళ్ళీ నటిగా బిజీ అవ్వాలని అనుకుంటోందట. నిజానికి కరోనా లాక్ డౌన్ కంటే ముందే సంజన కొన్ని సినిమాలకు సైన్ చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఒక తమిళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఏదేమైనా ఈ మధ్య తన లైఫ్ లో చోటు చేసుకున్న ఘటనలను మర్చిపోయి మళ్ళీ నటిగా బిజీ అవ్వాలని సంజన నిర్ణయియించుకుందని తెలుస్తోంది.