శ్రీనివాస మంగాపురం...హంటింగ్ మెలోడీ అదిరింది!
ఇందులో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29న) ఫస్ట్ సింగిల్‌గా `అలేల్లే అలేల్లే..` అంటూ సాగే హంటింగ్ మెలోడీని రిలీజ్ చేసి సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది.;
సూపర్‌స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ, బాలీవుడ్ క్రేజీ లేడీ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరో, హీరోయిన్‌లుగా పరిచయం అవుతున్న మూవీ `శ్రీనివాస మంగాపురం`. `ఆర్ఎక్స్ 100` వంటి కల్ట్ లవ్ స్టోరీ తరువాత అజయ్ భూపతి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న మూవీ ఇది. సీనియర్ నటుడు మోహన్ బాబు ఇందులో పవర్‌ఫుల్‌గా సాగే కీలక పాత్రలో నటిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ దగ్గరి నుంచే అందరిలో ఆసక్తిని రేకెత్తించడం మొదలు పెట్టింది.
రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేసి ఆ క్రేజ్‌ని టీమ్ మరింతగా పెంచడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్‌లో జయకృష్ణ, రషా తడానీల కెమిస్ట్రీ ఉండటంతో యూత్‌ని ఈ మూవీ ఎట్రాక్ట్ చేయడం ఖాయమనే టాక్ మొదలైంది. జయకృష్ణ, రషా తడానీ ఈ ఇద్దరూ స్టార్ కిడ్స్ కావడం, ఒకేసారి వీరిద్దరూ ఒకే సినిమాతో అరంగేట్రం చేస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే టీజర్, ఇందులో నటిస్తున్నకొత్త జంట నెట్టింట వైరల్ అవుతుండటంతో `శ్రీనివాస మంగాపురం` తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ని టీమ్ అప్పుడే మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29న) ఫస్ట్ సింగిల్‌గా `అలేల్లే అలేల్లే..` అంటూ సాగే హంటింగ్ మెలోడీని రిలీజ్ చేసి సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. విశేషం ఏంటంటే ఈ హంటింగ్ మెలోడీకి సంగీతం అందించిన యువ సంగీత సంచలనం జీవి ప్రకాష్ కుమార్ తన వాయిస్‌ని కూడా అందించాడు. సింగర్ హరిప్రియతో కలిసి ఈ రొమాంటిక్ మెలోడీని జీవి ప్రకాష్ కుమార్ పాడటం విశేషం.
గేయ రచయిత శ్రీమణి స్వరాలు అందించారు. `అలేల్లే..అలెల్లే..అదిరే కలలే..కలిసే యెదలే.. రాయిలో హాయికి..రేయిలో రంగుకి..ప్రాణమే నీ ప్రేమలే..` అంటూ సాగే ఈ మెలోడీలో జయకృష్ణ, రషా తడానీల కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో కుదిరింది. సాహిత్య పరంగానూ, విజులవల్ గానూ ఈ పాట ప్రతి ఒక్కరినీ ప్రేమ ఉయ్యాలలో ఉర్రూతలూగించేలా ఉంది. జయకృష్ణ, రషా తడానీలకిది ఫస్ట్ మూవీనే అయినా ఎక్కడా అది కనిపించకుండా చాలా పర్‌ఫెక్షన్‌తో నటించిన తీరు ఆకట్టుకుంటోంది.
రషా తడానీ అయితే పాత్రలో లీనమై సహజ సిద్ధంగా నటించిన తీరు ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఈ మెలోడీతో ఇద్దరు భగ్న ప్రేమికుల సున్నితమైన భావోద్వేగాల్ని దర్శకుడు అజయ్ భూపతి అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. `ఆర్ఎక్స్ 100`ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టిన అజయ్ భూపతి ఈ సినిమాకు కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోందని ఫస్ట్ సింగిల్‌తో హింట్ ఇచ్చేయడంతో సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఖుషీ ఫీలవుతున్నారు. మరి ఫస్ట్ సింగిలే ఈ రేంజ్‌లో ఉంటే మిగతా పాటలు ఏ స్థాయిలో ఉండాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.