వైరల్‌ వీడియో : రంగుల ప్రపంచం వెనుక చీకటి కోణం

సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. అయితే అక్కడ కూడా రంగులు మాత్రమే కాకుండా చీకటి కోణం ఉంటుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.;

Update: 2026-04-29 09:43 GMT

సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. అయితే అక్కడ కూడా రంగులు మాత్రమే కాకుండా చీకటి కోణం ఉంటుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. తెరపై కనిపించినంత మాత్రాన నిజ జీవితంలో వారు సెలబ్రిటీ హోదాతో అందమైన జీవితాన్ని సాగిస్తున్నట్లు కాదని ఈ మధ్య కాలంలో ఎంతో మందిని చూస్తే అర్థం అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో 20 నుంచి 25 శాతం మంది మాత్రమే రంగుల ప్రపంచంలో అందమైన జీవితాన్ని సాగిస్తున్నారు. మిగిలిన వారు అంతా కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా యజమానుల తర్వాత కార్మికులు కింది స్థాయిలో ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. డబ్బులు పెట్టే నిర్మాత రేపు ఎలా ఉంటాడు అనేది నమ్మకం లేదు.

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు...

ఇండస్ట్రీలో రాణించాలనే ఆశతో ప్రతి రోజు వందలాది మంది తమ జీవితాన్ని వదిలేసి మరీ కొత్త జీవితంలో అడుగు పెడుతారు. అలాంటి వారిలో అతి కొద్ది మంది మాత్రమే చిన్నా చితకా ఆఫర్లు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో నెగ్గుకు వస్తున్నారు. కొందరు వెనక్కి తిరిగి వెళ్తున్న వారు కూడా ఉన్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే కాకుండా ముంబై వంటి మహానగరంలో మోడలింగ్‌కు ఉన్న అవకాశాల నేపథ్యంలో ప్రతి రోజు వందలాది మంది అవకాశం వెతుక్కుంటూ వెళ్తున్నారట. ఇటీవల సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో వందలాది మంది ఔత్సాహికులు మోడలింగ్‌ పై ఆసక్తితో, మోడల్‌ అవ్వాలనే ఆశతో రోడ్లపై తమ ప్రొఫైల్‌ పట్టుకుని తిరుగుతున్నారు. మోడలింగ్ కోసం ఇంత డిమాండ్ ఉందా అంటూ చాలా మంది షాక్ అవుతున్నారు.

మోడలింగ్‌ ద్వారా సినిమాల్లో...

ఈ మధ్య కాలంలో మోడలింగ్‌ ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు. మోడల్స్‌ కి ఇండస్ట్రీ ఎంట్రీ చాలా సులువు అనే అభిప్రాయం ఉంది. అందుకే డైరెక్ట్‌గా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుక్కోకుండా మోడలింగ్ ద్వారా వెళ్లాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఈ మార్గంలో నడుస్తున్నారని తెలుస్తోంది. మోడలింగ్‌ పై ఆసక్తి ఉన్న వారు ఇటీవల యాడ్‌ ఏజెన్సీల వైపు చూస్తున్నారు. ముంబైలోని ప్రధాన యాడ్‌ ఏజెన్సీల వద్ద ప్రతి రోజు వందల సంఖ్యలో జనాలు ఉంటున్నారు. తమ జీవితంను అందంగా మల్చుకోవడం కోసం అందంగా రెడీ అయ్యి యాడ్‌ ఏజెన్సీల వైపు పరుగులు తీస్తున్నారు. ఆ క్రమంలో తమ కెరీర్‌ ను నష్టపోతున్నామని గుర్తించడం లేదు. మోడలింగ్‌ పై ఆసక్తి ఉందని వచ్చిన వారిలో కనీసం సగం మందికి కూడా కనీసం ఆఫర్లు రావడం లేదు అనేది ముంబై వర్గాల టాక్‌.

ముంబై, ఢిల్లీలో మోడలింగ్‌...

ముంబైతో పాటు ఢిల్లీ ఇంకా పలు మెట్రో నగరాల్లో మోడల్స్‌కి మంచి డిమాండ్ ఉంది. చిన్న ఈవెంట్‌ జరిగినా మోడల్స్ ను సంప్రదిస్తున్నారు. మోడలింగ్‌పై అవగాహణ ఉన్న వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే మోడలింగ్‌ ను కెరీర్‌గా ఎంపిక చేసుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్న వారిలో కొందరు మంచి సక్సెస్‌ను సాధించిన వారు ఉన్నారు. మోడలింగ్‌లోనూ ప్రతిభ కంటే ఎక్కువగా అదృష్టం కలిసి రావాలంటూ నిపుణులు చెబుతున్నారు. మోడలింగ్‌ కోర్స్ చేయడం ద్వారా ఆ రంగంలో అడుగు పెడితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్‌గా మోడల్‌ కావాలని ప్రయత్నం చేస్తే కెరీర్‌ పై దెబ్బ పడే అవకాశం ఉందని ప్రముఖ మోడల్‌ ఒకరు చెప్పుకొచ్చారు.




Tags:    

Similar News