• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే...

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

| భారతీయ చలనచిత్ర పరిశ్రమ సరిహద్దులను చెరిపివేసి గ్లోబల్ స్టేజ్‌పై సత్తా చాటిన‌ నాయికలలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రియాంక చోప్రా పేర్లు ముందు వరుసలో ఉంటాయి.

By - Srikanth Kontham
Update: 2026-11-03 16:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సరిహద్దులను చెరిపివేసి గ్లోబల్ స్టేజ్‌పై సత్తా చాటిన‌ నాయికలలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రియాంక చోప్రా పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ఎలాంటి సినిమా కుటుంబ నేపథ్యం లేకుండా స్వశక్తితో, అద్భుతమైన ప్రతిభతో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు విజయాల జెండా ఎగ‌రేసిన‌ దిగ్గజాలు. ఇద్దరు గ్లోబల్ ఐకాన్ల తర్వాత ఆ రేంజ్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని వరల్డ్ వైడ్ పాపులారిటీని సొంతం చేసుకున్న నటి దీపికా పదుకొణె మాత్రమే అన‌డంలో అతిశయోక్తి లేదు.

సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడి నుంచి సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన దీపికా పదుకొణె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.`ఓ శాంతి ఓ శాంతి` సినిమాతో అరంగేట్రం చేసిన అమ్మ‌డు అనతికాలంలోనే బాలీవుడ్‌లో తిరుగులేని టాప్ హీరోయిన్‌గా అవతరించారు. కమర్షియల్ హిట్లతో తో పాటు బలమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా పరిధిని విస్తరించుకున్నారు. `పద్మావత్`, `చెన్నై ఎక్స్‌ప్రెస్`, `పీకూ` వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేశారు.

ఐశ్వర్య రాయ్ ప్రపంచ సుందరి కిరీటంతో గ్లోబల్ దృష్టిని ఆకర్షిస్తే.. ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ సాధించి హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఇద్దరు సాధించిన ఘనతలను కొనసాగిస్తూ దీపికా పదుకొణె అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా పతాకాన్ని సగర్వంగా ఎగ‌రేసారు. ప్ర‌పంచ‌ ప్రఖ్యాత బ్రాండ్లకు గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యవహరించడం నుంచి ఆస్కార్ అవార్డ్స్ వేదికపై ప్రెజెంటర్‌గా మెరవడం వరకు అమ్మ‌డు సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు.

ముఖ్యంగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా దీపికా భారతీయ సినిమా కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. `ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జెండర్ కేజా` వంటి హాలీవుడ్ చిత్రంలో విన్ డీజిల్ సరసన నటించి హాలీవుడ్ మేకర్స్‌ను సైతం ఆకట్టుకున్నారు. విదేశీ మీడియా సంస్థలు సైతం భారతీయ నాయికల ప్ర‌స్తావ‌న వ‌స్తే ఐష్, పీసీల సరసన దీపిక పేరును ప్రస్తావిస్తుండటం ఆమె గ్లోబల్ రీచ్‌కు నిదర్శనం.

గ్లామర్ పరంగానే కాకుండా మానసిక ఆరోగ్యం వంటి సున్నితమైన సామాజిక అంశాలపై లివ్ లవ్ లఫ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కృషి అంతర్జాతీయ ప్రశంసలను అందుకుంది. గ్లోబల్ మ్యాగజైన్ల కవర్ పేజీలపై కనిపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌లో దూకుడు తగ్గించకుండా వరుస పాన్-ఇండియా ..గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు.

Tags:    
  • deepikapadukone 
  • aishwaryarai 
  • priyankachopra 
  • globalicon 

Similar News

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

Copyright @2026

Powered by Blink CMS