• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ ఆ రెండు రోజులు...

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

| ఈశ్వర్ సినిమాతో తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టిన నటుడు ప్రభాస్.. వర్షం సినిమాతో మొదటి ఘన విజయాన్ని సాధించాడు.

By - Gopi Velupala
Update: 2026-11-03 15:30 GMT

ఈశ్వర్ సినిమాతో తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టిన నటుడు ప్రభాస్.. వర్షం సినిమాతో మొదటి ఘన విజయాన్ని సాధించాడు. నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ చేసిన 'చత్రపతి', 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కన్ క్లూజన్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నూతన రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీస్ చిత్రీకరణ సమయంలో వాళ్ల మధ్య ఏర్పడిన అనుబంధం సినీ వర్గాల్లో చాలా ప్రత్యేకంగా నిలిచింది.

రాజమౌళి - ప్రభాస్ మధ్య పరిచయం

రాజమౌళి రాసుకున్న స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కథని మొదట ప్రభాస్ కి వినిపించాడట. అప్పుడే వాళ్ళిద్దరికి పరిచయం అయిందట. రాజమౌళి చెప్పిన కథ ప్రభాస్ ను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అందులో డ్రామా ఎక్కువగా ఉందని చెప్పి రిజెక్ట్ చేశాడట. మొత్తానికైతే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత 'సింహాద్రి' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

ఛత్రపతి విడుదల సమయం...

ఛత్రపతి సినిమా రిలీజ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని సినీ వర్గాలు గుర్తు చేసుకుంటుంటాయి. సినిమా రిలీజ్ అయిన మొదటి రెండు రోజులు ఫలితంపై ఎంతో ఉత్కంఠ గా ఉన్న ప్రభాస్ ప్రతి ఐదు నిమిషాలకొకసారి రాజమౌళికి ఫోన్ చేసి డిస్ట్రిబ్యూటర్ల సమాచారాన్ని థియేటర్ దగ్గర వస్తానన్న రెస్పాన్స్ ను చెబుతుండేవాడట. డార్లింగ్ మనం హిట్టు కొట్టేసాం అని ప్రభాస్ చెబుతుంటే రాజమౌళి కామ్ గా వింటుండేవాడట. ఈ విషయాన్ని రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ప్రస్తుత ప్రాజెక్టులు

ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో 'స్పిరిట్' మూవీ చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' సినిమా చేస్తున్నాడు. రాజమౌళి మహేష్ బాబు తో 'వారణాసి' సినిమా బిజీ లో ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ స్థాయి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు...ఇక రెండు దశాబ్దాలుగా మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతూ కమర్షియల్ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్ రాజమౌళి కాంబో మరోసారి జతకడితే చూడాలని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు...

Tags:    
  • prabhas 
  • ssrajamouli 
  • chatrapathi 
  • baahubali 
  • tollywood 

Similar News

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS