క‌రుప్ప కూడ‌వా.. లిరిక‌ల్ వీడియో..పూన‌కాలేనా?

విభిన్న‌మైన చిత్రాల‌కు, పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన హీరో సూర్య‌. గ‌త కొంత కాలంగా ఎన్ని ప్ర‌యోగాలు చేసినా సూర్య‌కు క‌లిసి రావ‌డం లేదు.;

Update: 2026-04-29 09:42 GMT

విభిన్న‌మైన చిత్రాల‌కు, పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన హీరో సూర్య‌. గ‌త కొంత కాలంగా ఎన్ని ప్ర‌యోగాలు చేసినా సూర్య‌కు క‌లిసి రావ‌డం లేదు. ఎంత కొత్త క‌థ అని ప్ర‌య‌త్నించినా చేదు అనుభ‌వ‌మే ఎదుర‌వుతోంది. `జై భీమ్` త‌రువాత మ‌రో స‌క్సెస్‌ని త‌న ఖాతాలో వేసుకోలేక‌పోతున్న సూర్య ఈ సారి ప‌క్కా రూటెడ్ స్టోరీతో చేస్తున్న మూవీ `క‌రుప్పు`. ఆర్‌.జె. బాలాజీ ద‌ర్శ‌కుడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై టాలెంటెడ్ బ్ర‌ద‌ర్స్‌గా పేరు తెచ్చుకున్న ఎస్‌. ఆర్ ప్ర‌భు, ఎస్‌.ఆర్‌. ప్ర‌కాష్ బాబు ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు.




 


మే 14న త‌మిళంతో పాటు తెలుగులో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీంతో సినిమా రిలీజ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న సంద‌ర్భంగా టీమ్ ప్ర‌మోష‌న్స్‌ని స్పీడ‌ప్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియోతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసింది. త‌మిళ వెర్ష‌న్‌కు సంబంధించిన `క‌రుప్పా కూడ‌వా..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేసింది. సాయి అభ్యంక‌ర్ ఈ పాట‌కు సంగీతాన్ని అందించ‌డ‌మే కాకుండా సంప్ర‌దాయ ప‌ల్లె వాయిద్యాల‌తో ఈ పాట‌కు వీఎన్ మ‌హాలింగంతో క‌లిసి స్వ‌రాన్ని కూడా అందించాడు.

స్పెష‌ల్ వీడియో సాంగ్‌ల‌తో యూత్‌ని ఉర్రూత‌లూగించిన సాయి అభ్యంక‌ర్ ఈ పాట‌కు మాత్రం లోక‌ల్ వాయిద్యాల‌ని ప్ర‌ధానంగా తీసుకుని మ్యూజిక్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ఓ ఎమోష‌న‌ల్ సాంగ్ గా సాగే ఈ సాంగ్ ప్ర‌ముఖ ప్లాట్ ఫామ్‌ల‌లో ట్రెండ్ అవుతూ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. `అండ‌ము పిండ‌ము...అల‌ర వ‌క్కిర‌న్‌..ఆగండ క‌న్నోడ... అంటూ రోమాంచితంగా సాగే ఈ పాట థియేట‌ర్ల‌లో మాత్రం సూర్య అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే విడుద‌లైన `గాడ్ మోడ్‌`, నాగ నాలు పేరు.. వంటి సాంగ్స్ నెట్టింట‌, ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల‌లో ట్రెండ్ అవుతూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. తాజాగా విడుద‌ల చేసిన థ‌ర్డ్ లిరిక‌ల్ వీడియో మాత్రం థియేట‌ర్ల‌లో అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించేలా ఉంది. విజువ‌ల్స్ ప‌రంగానూ, లిరిక‌ల్ పరంగానూ ఆడియ‌న్స్‌కు అదే ఫీల్‌ని క‌లిగించేలా ఉంది.

మే 14న రిలీజ్‌కు ముస్తాబ‌వుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. చాలా ఏళ్ల విరామం త‌రువాత సూర్య‌తో క‌లిసి త్రిష న‌టించిన సినిమా కావ‌డంతో అంతా ఆస‌క్తిగా ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో కురుప్పుస్వామి స్టోరీ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీ సూర్య ఫ్లాపుల‌కు బ్రేక్ వేసి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందిస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.



Full View


Tags:    

Similar News