20 ఏళ్లకే 'పోకిరి' ని మర్చి పోయారేంటి?
రికార్డ్ బ్రేకింగ్ సినిమాల గురించి ప్రతి సంవత్సరం మాట్లాడుకోవడం అనేది తప్పనిసరి. అది కచ్చితంగా కొత్త ఫిల్మ్ మేకర్స్‌కి ఆదర్శంగా ఉంటుంది.;
తెలుగు సినిమా చరిత్ర పుటలను తిరిగేస్తే కొన్ని సినిమాలు ప్రముఖంగా కనిపిస్తాయి. అందులో 'పోకిరి' ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్ బాబును సూపర్ స్టార్‌గా మార్చిన 'పోకిరి' సినిమాతో దర్శకుడు పూరి జగన్నాథ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విషయం తెల్సిందే. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డ్‌లన్నింటిని కూడా తూడ్చి పెట్టిన పోరికి సినిమా ఎంతో మందికి ఆల్ టైమ్ ఫేవరేట్ అనడం అతిశయోక్తి కాదు. మహేష్ బాబు ఇమేజ్‌ను అమాంతం పెంచేసిన పోకిరి సినిమా విడుదలై సరిగ్గా 20 ఏళ్లు పూర్తి అయింది. 2006 ఏప్రిల్ 28న ఒక మోస్తరు అంచనాలతో విడుదలైన పోకిరి సినిమా రోజులు గడుస్తున్నా కొద్ది హిట్.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్.. ఇండస్ట్రీ హిట్‌గా మారుతూ వచ్చింది. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఉండటంతో ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్ అయ్యారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన...
పోకిరి వంటి సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా మేకర్స్ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ 20 ఏళ్ల అరుదైన మైలు రాయిని చేరుకున్నప్పటికీ పోరికి సినిమా గురించి చిన్న సెలబ్రేషన్ కూడా లేదు. ఆ మధ్య ఒక చిన్న హీరో సినిమా వచ్చి 20 ఏళ్లు అయిన సందర్భంగా హడావిడి చూశాం, అంతే కాకుండా ఆ సినిమాను రీ రిలీజ్ చేసి హంగామా చేశారు. కానీ పోకిరి సినిమా 20 ఏళ్ల సందర్భంగా ఫ్యాన్స్ హంగామా తప్ప మేకర్స్ నుంచి ఎలాంటి హడావిడి లేదు. దాంతో చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం మేకర్స్ ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్ అయినా పోకిరి 20 ఏళ్ల సందర్భంగా ట్వీల్ లేదా ఒక యూట్యూబ్ వీడియో లేదంటే ఒక ఆడియో బైట్ అయినా ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ పోకిరి కి 20 ఏళ్లు...
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమాతో బిజీగా ఉన్నాడు. అందుకే పోకిరి సినిమా గురించి ఆయన కనీసం ట్వీట్ వేయలేక పోయాడు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం రాజమౌళి సినిమా పై ఉంటుంది అనడంలో సందేహం లేదు. పైగా మహేష్ బాబు ట్వీట్ వేయాలి అన్నా కూడా కచ్చితంగా రాజమౌళి పర్మీషన్ కావాల్సి ఉంటుంది. అందుకే మహేష్ బాబు పోకిరి 20 ఏళ్లకు సంబంధించిన పోస్ట్ పెట్టి ఉండడు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండే పూరి జగన్నాథ్ ఎందుకు పోకిరి సినిమా గురించి పోస్ట్ చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. మహేష్ బాబుతో కొన్ని కారణాల వల్ల పూరికి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల పోరికి 20 ఏళ్ల స్పెషల్ పోస్ట్ ను వేసి ఉండక పోవచ్చు అని కొందరు మాట్లాడుకుంటున్నారు.
పూరి జగన్నాథ్ ఏం చేస్తున్నాడు...
రికార్డ్ బ్రేకింగ్ సినిమాల గురించి ప్రతి సంవత్సరం మాట్లాడుకోవడం అనేది తప్పనిసరి. అది కచ్చితంగా కొత్త ఫిల్మ్ మేకర్స్‌కి ఆదర్శంగా ఉంటుంది. చాలా కొత్త విషయాలను తెలుసుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది. 20 ఏళ్ల సందర్భంగా పోకిరి కి సంబంధించిన మేకింగ్ వీడియో లేదా సినిమా మేకింగ్ కు సంబంధించిన ఇంటర్వ్యూ వంటివి చేసి ఉంటే చాలా మందికి ఉపయోగదాయం గా ఉండేదని చాలామంది మాట్లాడుతున్నారు. మరీ 20 ఏళ్లకే పోరికి వంటి సినిమాను హీరో మహేష్ బాబు, దర్శకుడు పూరి జగన్నాథ్ మర్చి పోవడంను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఒక సినిమా విడుదలై 20 ఏళ్లు అయిన తర్వాత కూడా దాని గురించి ఇంకా మాట్లాడుకోవడం, దాని రికార్డ్‌ల గురించి చర్చ జరగడం అరుదుగా జరుగుతుంది. అలాంటి సినిమాలను కచ్చితంగా మేకర్స్ మర్చి పోకుండా సోషల్ మీడియా ద్వారా స్పందించాల్సిన అవసరం ఉంది. మరి పోకిరి మర్చి పోవడం వెనుక కారణం ఏమైనా ఉందా అనేది ఆ ఇద్దరు స్పందిస్తే కాని తెలియదు.