ఆయ‌న‌కు.. నాకు పాతికేళ్ల గ్యాప్ ఉంటే ఏమైంది? - న‌టి

Update: 2021-05-29 02:30 GMT
సినిమా అయినా.. బుల్లితెర అయినా.. హీరోయిన్ల‌కు వ‌య‌సు ప‌ట్టింపు చాలా ఎక్కువ‌గా ఉంటుంది. పెద్ద న‌టుల స‌ర‌స‌న చేస్తే.. వ‌య‌సైపోయిన వారి జాబితాలో ప‌డేస్తార‌న్న‌ది వారి భ‌యం. అందుకే.. చాలా మంది ఇలాంటి విష‌యాల్లో కేర్ తీసుకుంటారు. అయితే.. త‌న‌కు మాత్రం అలాంటి భ‌యం లేద‌ని చెబుతోంది హిందీ టీవీ న‌టి ప్రియాల్ మ‌హాజ‌న్‌.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ 'క‌ల‌ర్స్'లో ప్రసారం అవుతున్న'మోల్కి'లో లీడ్ రోల్ పోషిస్తోంది. ఆడియ‌న్స్ ను అల‌రిస్తూ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోందీ సీరియ‌ల్‌. దీంతో.. ప్రియాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలో.. ఈ మ‌ధ్య‌నే ఓ ఇంట‌ర్వ్యూకు హాజ‌రైన ప్రియాల్‌.. త‌న లైఫ్‌, కెరియ‌ర్ కు సంబంధించిన‌ చాలా విష‌యాలు పంచుకుంది.

'మోల్కి' సీరియల్ లో పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న వ్య‌క్తికి భార్య‌గా వెళ్తుంది ప్రియాల్‌. ఈ స‌మ‌యంలో వారి మ‌ధ్య ఎలాంటి ప్రేమ మొద‌లైంద‌న్న‌ది క‌థ‌. పెళ్లైన వ్య‌క్తిగా సీనియ‌ర్ న‌టుడు అమ‌ర్ న‌టిస్తున్నారు. ఆయ‌న వ‌య‌సు 44 సంవ‌త్స‌రాలు కాగా.. ప్రియాల్ వ‌య‌సు కేవ‌లం 19 ఏళ్లు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన‌ యాంక‌ర్‌.. అంత పెద్ద వ్య‌క్తికి భార్య‌గా న‌టించ‌డం ఇబ్బంది అనిపించ‌ట్లేదా? అని అడిగారు.

దీనికి ఆమె స్పందిస్తూ..త‌న‌కు అలాంటి ఇబ్బందేమీ లేద‌ని చెప్పింది. అది న‌ట‌న మాత్ర‌మేన‌ని చెప్పిన ప్రియాల్‌.. ఆయ‌న అనుభ‌వం నుంచి తాను ఎంతో నేర్చుకుంటున్నాన‌ని తెలిపింది. ఆయ‌న న‌టించిన ఎన్నో సీరియ‌ల్స్ తాను చూస్తూ పెరిగాన‌ని, ఇప్పుడు ఆయ‌న‌తో క‌లిసి న‌టిస్తుండ‌డం గొప్ప అవ‌కాశంగా భావిస్తున్నానని చెప్పింది.
Tags:    

Similar News