హిట్ కొడితే లేడీస్ లో ఆవిడో సంచ‌ల‌నం!

తొలి సినిమా రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో వైర‌ల్ అవుతుందంటే? అందుకు కార‌ణం బోల్డ్ సీన్ తోనే విమ‌ర్శ‌ల‌కు దారి తీయ‌డం అన్న‌ది కాద‌న‌లేని నిజం.;

Update: 2026-01-12 23:30 GMT

గీతూ మోహ‌న్ దాస్ పాన్ ఇండియాలో ఇప్పుడో సంచ‌ల‌నం. తొలి సినిమా రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో వైర‌ల్ అవుతుందంటే? అందుకు కార‌ణం బోల్డ్ సీన్ తోనే విమ‌ర్శ‌ల‌కు దారి తీయ‌డం అన్న‌ది కాద‌న‌లేని నిజం. య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న టాక్సిక్ పై ఇంత వ‌ర‌కూ స‌రైన బ‌జ్ లేదు. ఒక్క గ్లింప్స్ తో మేకింగ్ ప‌రంగా తానేంటో నిరూపించుకున్నారు. ఓ లేడీ డైరెక్ట‌ర్ ఆ రేంజ్ లో ఇంటిమేట్ స‌న్నివేశం డిజైన్ చేయ‌డంతోనే గీతూ పేరు పాన్ ఇండియాలో మోరుమ్రుగుతోంది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్లో మార్కెట్ లోకి వ‌దిలిన గ్లింప్స్ పైనే స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగు తోంది.

ఇంత వ‌ర‌కూ య‌శ్ పేరు మాత్ర‌మే హైలైట్ అయింది. ఇక‌పై అత‌డితో పాటు గీతూ మోహ‌న్ దాస్ కూడానిరంత‌రం చ‌ర్చ‌కొచ్చే పేరుగా మారిపోయింది. ఇక సినిమా హిట్ అయితే పాన్ ఇండియాలో ఆమెకొచ్చే గుర్తింపు అసాధార‌ణ‌మైందే. ఇంత వ‌ర‌కూ భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ లేడీ డైరెక్ట‌ర్ పేరు ఈ రేంజ్ లో వైర‌ల్ అయింది లేదు. లేడీ డైరెక్ట‌ర్లు ఉన్నది అతి కొద్ది మందే. బాలీవుడ్ లో ఫ‌రాఖాన్, కోలీవుడ్ లో సుధ కొంగ‌ర‌, టాలీవుడ్ లో నందినిరెడ్డి త‌ప్ప ఇంకెవ్వ‌రూ పెద్ద‌గా క‌నిపించ‌రు. 'క‌ళ్లీ పాల్ లా ఓరు టీస‌` అనే ఓ చిత్రాన్ని పా రంజిత్ నిర్మించారు.

ఈ చిత్రంతో అభీషా..స్నేహ‌..బెల్సిన్.. కనీష్కా సీఈ.. శివ‌రంజిని డైరెక్ట‌ర్ చేసారు. కానీ వారు పెద్ద‌గా వెలుగులోకి రాలేదు. ఆ త‌ర్వాత మ‌రే సినిమా డైరెక్ట్ చేసిన ఘ‌న‌త వారికి లేదు. వీళ్లంతా తెరెక్కించిన సినిమాలు ఓ ఎత్తైతే? గీతూ మోహ‌న్ దాస్ ఒక్క‌రే మ‌రో ఎత్తులా నిలిచారు. వారి శైలికి భిన్న‌మైన చిత్రం. ఓ లేడీ డైరెక్ట‌ర్ టాక్సిక్ లాంటి బోల్డ్ కంటెంట్ ని ఎంచుకోవ‌డ‌మే పెద్ద సాహ‌సం. అందులోనూ గ్లింప్స్ లోనే ఇంటిమేట్ సీన్స్ రాయ‌డం అన్న‌ది అంత‌కు మించిన సాహ‌సం. దీంతో టీజ‌ర్, ట్రైల‌ర్ ని ఇంకే రేంజ్ లో వ‌దులుతుందో? అంటూ కుర్రాళ్ల‌లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.

మూడు గంట‌ల సినిమాలో ఇంకే రేంజ్ సీన్స్ ఉంటాయో? అంటూ చ‌ర్చించుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. వాస్త‌వానికి ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్..సాంపిల్ టీజ‌ర్ వ‌దిలిన స‌మ‌యంలో? పెద్ద‌గాహైప్ రాలేదు. రొటీన్ గ్యాంగ్ స్ట‌ర్ డ్ర‌గ్ కంటెంట్ గా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ను తీసుకుంది. ఓల్డ్ రొటీన్ కంటెంట్ తోనే సినిమా తీస్తున్నార‌నే టాక్ స్ప్రెడ్ అయింది. కానీ తాజా గ్లింప్స్ తో ఆ నెగిటివిటీ మొత్తాన్ని పాజిటివ్ గా మార్చేసింది.

Tags:    

Similar News