ప్రభాస్ లైనప్.. ఇక ప్లానింగ్ అవసరమేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన లైనప్ తో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఆయన అప్ కమింగ్ లిస్ట్ లో చాలా వరకు సీక్వెల్సే ఉన్నాయి.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన లైనప్ తో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఆయన అప్ కమింగ్ లిస్ట్ లో చాలా వరకు సీక్వెల్సే ఉన్నాయి. లైనప్ లోని సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్నవే. అయితే ఇప్పుడు ఆ చిత్రాల షూటింగ్స్ కోసం సినీ వర్గాలు, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సరైన ప్లాన్ లేకపోవడంతో మేకర్స్ కు ఖర్చు తడిసి మోపెడవుతుందని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో ఆయన సినిమాల షూటింగ్ లు చాలా లేట్ అవుతుండడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ప్రభాస్ షెడ్యూల్స్, మధ్యలో తీసుకునే బ్రేక్స్ కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయనేది ఇన్ సైడ్ టాక్. రీసెంట్ గా డార్లింగ్ ది రాజా సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ సినిమా విషయంలో అదే జరిగింది. ఎందుకంటే.. ఆ చిత్రం కేవలం ఏడాదిలో పూర్తి కావాల్సి ఉండగా, అలా లేట్ అయిపోయింది.
మూడేళ్లపాటు షూటింగ్ జరగడంతో.. ఖర్చులు పెరిగాయి. అందుకు తగ్గట్లు వసూళ్లు ఇప్పుడు సాధించడం లేదని వినికిడి. దీంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ప్రభాస్ లైనప్ లో ఉన్న మిగతా చిత్రాల నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. అయితే డార్లింగ్ మొన్నటి వరకు ఫౌజీ షూటింగ్ లో పాల్గొన్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమాలో ఆయనకు చెందిన ఇంకొన్ని సీన్స్ మిగిలి ఉన్నాయట.
కానీ ఇంతలో ప్రభాస్.. స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. నిజానికి ఆ సినిమా చిత్రీకరణ చాలా రోజుల క్రితమే మొదలు కావాల్సి ఉండగా, మేకర్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇటీవల మొదలు పెట్టారు. కానీ ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ లో పాల్గొంటున్నా.. ఫౌజీ మాత్రం పెండింగ్ లో ఉంచారు. దానిని త్వరగా పూర్తి చేసేస్తే పర్లేదు. కానీ లేట్ అయితే వడ్డీలు, ఖర్చులు పెరిగిపోతాయని చెప్పాలి.
అలా అని స్పిరిట్ మూవీ కంప్లీట్ చేయకుండా మళ్లీ ఫౌజీ సెట్స్ లోకి వెళ్తే.. ఇక్కడ ఖర్చు పెరుగుతుంది. దీంతో నిర్మాతలంతా ఇంకా డైలమాలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఒకెత్తు అయితే ప్రభాస్ లైనప్ లో ఉన్న కల్కి 2898 ఏడీ, సలార్, రాజా సాబ్ సీక్వెల్స్ ఉన్నాయి. అందులో కల్కి సీక్వెల్ షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ మూవీస్ తో బిజీగా ఉన్నారు.
అందుకే ప్రభాస్ తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్స్ విషయంలో సరైన ప్లాన్ తో ముందుకు వెళ్లాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ షెడ్యూల్స్ ను క్లియర్ గా ప్లాన్ చేసి, అనుకున్న టైమ్ కు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని టాక్ వినిపిస్తోంది. మరి ప్రభాస్ ఇప్పుడు ఏం చేస్తారో.. ఎలా ప్లాన్ చేస్తారో వేచి చూడాలి.