టాలీవుడ్ ని ఏలేసేలా బుచ్చిబాబు ప్రణాళిక!
గురువును మించిన శిష్యుడిగా ఎదిగే వ్యూహ రచనతో ముందుకెళ్తున్నాడా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది.;
సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు టాలీవుడ్ ని ఏలేసే పెద్ద ప్లాన్ లో ఉన్నాడా? గురువును మించిన శిష్యుడిగా ఎదిగే వ్యూహ రచనతో ముందుకెళ్తున్నాడా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ఇక్కడ ముందుగా అబ్దుల్ కలాం గారు యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పెద్ద పెద్ద కలలు కనడం..వాటిని సాధించే వరకూ విడిచిపెట్టకపోవడం. ఈ తత్వాన్ని యువత అలవార్చుకోవాలని కలాంగారు చెప్పారు. తాజాగా బుచ్చిబాబును చూస్తుంటే? కలాం గారు మాటలే గుర్తొస్తున్నాయి.
బుచ్చిబాబు కలలు కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి. వాటి కోసం నిరంతరం అంతే శ్రమిస్తున్నాడు అన్నది అంతే వాస్తవం. తొలి సినిమా `ఉప్పెన` తో హిట్ అందుకున్నాడు. దీంతో రెండవ సినిమా టార్గెట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను పెట్టుకున్నాడు. కథ చెప్పాడు. కానీ చివరి నిమిషంలో ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. అటుపై మరో కథతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని మెప్పించాడు. సింగిల్ సిట్టింగ్ లోనే చరణ్ తో ఒకే చెప్పించాడు. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో `పెద్ది` తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా దర్శకుడిగా ఏకంగా సంగీత సంచలనం రెహమాన్ నే రంగంలోకి దించాడు బుచ్చిబాబు.
ఇది చూసి గురువు సుకుమార్ షాక్ అయ్యాడు. ఎన్టీఆర్, చరణ్, రెహమాన్ అంటూ పెద్ద పెద్ద వారి పేర్లు చెప్పడంతో? తాను కూడా చేయలేని సాహసాన్ని శిష్యుడు చేస్తున్నాడని ఎంతో మురిసిపోయాడు. ఓ క్లారిటీలో బుచ్చిబాబు ముందుకెళ్లడాన్ని గురువుగా ఎంతో ప్రశంసించాడు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరో హించాలని కోరుకున్నారు. `పెద్ది` తర్వాత తారక్ తోనే సినిమా చేస్తానని ఆ మధ్య బుచ్చిబాబు అన్నాడు. అందులో ఎలాంటి అనుమానాలు కూడా ఉండవన్నాడు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ దొరికే పరిస్థితులు లేవు. అతడికి రకరకాల కమిట్ మెంట్లు ఉండటంతో? బుచ్చిబాబు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వైపు చూస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ప్రభాస్ కి ఇప్పటికే స్టోరీ లైన్ వినిపించాడట. డార్లింగ్ కి నచ్చడంతో పాజిటివ్ గా స్పందించాడుట. దీంతో బుచ్చిబాబు పూర్తి స్క్రిప్ట్ ను సిద్దం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తోంది. `పెద్ది` రిలీజ్ అనంతరం బుచ్చిబాబు ఆ పనుల్లో నిమగ్నమయ్యే అవకాశం ఉంది. మరి ప్రభాస్ కూడా బిజీగా ఉన్నాడు? అతడు ఎలా డేట్లు ఇవ్వగలడు? అంటే డార్లింగ్ కిందా మీదా పెట్టి ఏదో ఒకటి చేయగల సమర్ధుడు. `పౌజీ` ప్రాజెక్ట్ అలా పట్టాలెక్కిందే. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు కూడా సరైన స్టోరీతో మెప్పిస్తే డేట్లు ఇవ్వకపోతాడా? అన్న కాన్పిడెంట్ తో డార్లింగ్ ముందుకెళ్లాడు. లక్కీగా ఊ కొట్టాడు. ఇదంతా పక్కన బెడితే `ఉప్పెన` అనే సక్సస్ తో బుచ్చిబాబు వరుసగా అగ్ర హీరోల్ని టార్గెట్ చేయడం చూస్తుంటే? పెద్ద ప్లాన్ తోనే ఇండస్ట్రీకి వచ్చినట్లు కనిపిస్తోంది. `పెద్ది` సక్సెస్ అయితే గనుక బుచ్చిబాబు వేగాన్ని ఆపడం అసాధ్యమే.