మ‌ళ్లీ మెగా మాస్ తోనా? స‌రి కొత్త‌గానా?!

మాస్ కంటెంట్ ని ప‌ర్పెక్ట్ గా డీల్ చేయగ‌ల ద‌ర్శ‌కుడు బాబి. ఆ విష‌యంలో హీరోల్ని పైకి లేప‌గ‌ల‌డు? బ్యాలెన్స్ గాను చూపించ‌గ‌ల‌డు.;

Update: 2026-03-04 06:32 GMT

మెగాస్టార్ చిరంజీవిని ఓ మాస్ అభిమాని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అన్న‌ది `వాల్తేరు వీర‌య్య‌`లో చూసాం. చిరంజీవి హీరోగా బాబి కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. మెగాస్టార్ పై బాబి అభిమాన‌మంతా ఆ సినిమాలో చూపించాడు. నిజానికి వెండి తెర‌పై అలాంటి చిరంజీవిని చూసి చాలా కాల‌మ‌వుతుంది. దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత మెగాస్టార్ లో అస‌లైన మాస్ ని బాబి చూపించాడు. 1993లో చిరంజీవి న‌టించిన `ముఠామేస్త్రి` సమీపంగానే `వాల్తేరు వీర‌య్య` లో క్యార‌క్ట‌రైజేష‌న్ ఉంటుంది.

'ముఠామేస్త్రి' త‌ర్వాత ఆ రేంజ్ ఊర మాస్ ను మెగాస్టార్ మ‌రే సినిమాలో ప్ర‌య‌త్నించలేదు. ఆ పాయింట్ ను బేస్ చేసుకునే బాబి తెలివిగా `వాల్తేరు వీర‌య్య‌`లో హైలైట్ చేసి స‌క్సెస అయ్యాడు. 1993-2023 మధ్య‌లో కూడా చిరంజీవి కొన్ని మాస్ పాత్ర‌ల్లో క‌నిపించారు. కానీ వీర‌య్య పాత్ర‌కు వ‌చ్చిన రెస్పాన్స్ రాలేదు. తాజాగా ఇదే కాంబినేష‌న్ లో చిరంజీవి 158వ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. `వాల్తేరు వీర‌య్య` విజ‌యం స‌హా బాబి గ‌త విజ‌యాలు చూసే చిరంజీవి మ‌రో అవ‌కాశం క‌ల్పించారు. బాబి కెరీర్లో ఒక్క ఫెయిల్యూర్ త‌ప్ప మిగ‌తా సినిమాల‌న్నీ బాగానే ఆడాయి.

మాస్ కంటెంట్ ని ప‌ర్పెక్ట్ గా డీల్ చేయగ‌ల ద‌ర్శ‌కుడు బాబి. ఆ విష‌యంలో హీరోల్ని పైకి లేప‌గ‌ల‌డు? బ్యాలెన్స్ గాను చూపించ‌గ‌ల‌డు. ఆ న‌మ్మ‌కంతోనే చిరంజీవి మ‌రో ఆలోచ‌న లేకుండా ఛాన్స్ ఇచ్చారు. ఇటీవ‌లే `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు`తో చిరంజీవి ఖాతాలో మ‌రో విజ‌యం న‌మోదైంది. ఇందులో క్లాస్ ప్ల‌స్ మాస్ చిరంజీవిని హైలైట్ చేసారు. ఈ సినిమా క్లాస్ కంటే మాస్ కే బాగా కనెక్ట్ అయింది. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ 158వ సినిమా కంటెంట్ ఉలా ఉంటుంది? అన్న దానిపై అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది. బాబి గ‌త సినిమాల‌ను దృష్టిలో పెట్టుకుని ర‌క‌ర‌కాల గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి.

మ‌ళ్లీ ఊర మాస్ ఎంటెంట్ తోనే వ‌స్తున్నారా? అన్న‌ది కొంద‌రి అంచ‌నా అయితే క్లాస్ ప్ల‌స్ మాస్ ని జోడించి చూపించ‌బోతున్నాడు? అన్న‌ది ఇంకొంత‌ మంది వాద‌న‌. మ‌రోవైపు పూర్తిగా స్టైలిష్ యాక్ష‌న్ చిత్రాన్నే తీస్తున్నాడు? అన్న‌ది మ‌రో వెర్ష‌న్. మ‌రి దీనిపై క్లారిటీ రావాలంటే? ఇంకొంచెం స‌మ‌యం ప‌డుతుంది. సాధార‌ణంగా ఏ ద‌ర్శ‌కుడికైనా ఓ ప్లేవ‌ర్ ఉంటుంది. ఆ ప్లేవ‌ర్ దాటి రావ‌డం అంత సుల‌భం కాదు. ఎలాంటి అంశాన్ని తీసుకున్నా? ఆ ప్లేవ‌ర్ క‌థ‌లో క‌నిపిస్తుంది. మ‌రి అన్న‌య్య కోసం బాబి త‌న ప్ ప్లేవ‌ర్ ని దాటొస్తాడా? త‌న కోణంలో బాస్ ని ఆవిష్క‌రిస్తాడా? అన్న‌ది చూడాలి. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది.

Tags:    

Similar News