మ‌నోజ్ రుణం తీర్చుకునే టైమ్ వ‌చ్చేసింది!

80, 90వ ద‌శ‌కంల‌లో క్రేజీ హీరోలంతా క‌లిసి సినిమాలు చేసేవారు. ఒక హీరో మూవీలో మ‌రో హీరో కీ రోల్‌లో న‌టించ‌డం అప్ప‌ట్లో కామ‌న్‌గా ఉండేది.;

Update: 2026-03-04 05:22 GMT

80, 90వ ద‌శ‌కంల‌లో క్రేజీ హీరోలంతా క‌లిసి సినిమాలు చేసేవారు. ఒక హీరో మూవీలో మ‌రో హీరో కీ రోల్‌లో న‌టించ‌డం అప్ప‌ట్లో కామ‌న్‌గా ఉండేది. ఆ త‌రువాత అది చాలా వ‌ర‌కు త‌గ్గి సోలో హీరోలుగా సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. మ‌ళ్లీ ఈ రోజులు ఇప్పుడు మొద‌లయ్యాయి. గ‌త కొంత కాలంగా స్టార్ హీరోల సినిమాల్లో మ‌రో స్టార్, లేదా అంత‌కు త‌క్కువ క్రేజ్ ఉన్న హీరో కీ రోల్‌లో న‌టించ‌డం అనే సంప్ర‌దాయం మొద‌లైంది. తాజాగా అది మ‌రింతగా పెరిగి స్టోరీ డిమాండ్ చేస్తే స్టార్‌లు, క్రేజీ న‌టీన‌టులు, సీనియ‌ర్ హీరోలు కూడా సై అంటూ ముందుకొస్తున్నారు.

మంచు మ‌నోజ్ సెకండ్ ఇన్నింగ్స్..

ఇదే త‌ర‌హాలో యంగ్ హీరోలు, టైర్‌ టు స్టార్స్ కూడా ఈ విష‌యంలో వెనుకాడ‌టం లేదు. తాజాగా మంచు మ‌నోజ్ కూడా ఇదే పంథాలో సెకండ్ ఇన్నింగ్స్ శ్రీ‌కారం చుట్ట‌డం..విజ‌య‌వంతంగా స‌క్సెస్ కావ‌డం తెలిసిందే. తొమ్మిదేళ్లు సినిమాల‌కు, ఇండ‌స్ట్రీకి దూరాన్ని మెయింటైన్ చేస్తూ వ‌చ్చిన మంచు మ‌నోజ్ `భైర‌వం` మూవీతో త‌న సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీ‌కారం చుట్టాడు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా, నారా రోహిత్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో మనోజ్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు.

ఈ మూవీ త‌రువాత `మిరాయ్‌`లోనూ మ‌హాబీర్ లామాగా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి అద‌ర‌గొట్టాడు. ప్ర‌స్తుతం సోలో హీరోగా `డేవిడ్ రెడ్డి`లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో హీరోగా మ‌ళ్లీ మంచు మ‌నోజ్ ట్రాక్‌లోకి రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలోనే మంచు మ‌నోజ్‌కు రుణః తీర్చుకునే అవ‌కాశం వ‌చ్చింది. అదే నంద‌మూరి బాల‌కృష్ణ మూవీతో. వివారాల్లోకి వెళితే..మంచు మ‌నోజ్‌, ల‌క్ష్మీప్ర‌స‌న్న ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ `ఊ కొడ‌తారా ఉలిక్కిప‌డ‌తారా?`. ఇందులో బాల‌య్య మ‌హారాజు త‌ర‌హా క్యారెక్ట‌ర్‌లో ఘోస్ట్‌గా క‌నిపించి అద‌రగొట్టాడు.

మంచు ఫ్యామిలీతో ఉన్న అనుబంధం..

మంచు ఫ్యామిలీ కోసం బాల‌య్య చేసిన ఈ సాహ‌సం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయింది. స్టార్ హీరో అయి ఉండి ఇలాంటి క్యారెక్ట్ చేయ‌డం ఏంటీ అని అంతా అవాక్క‌య్యారు. దీనిపై ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చే జ‌రిగింది. బాల‌య్య‌కు మోహ‌న్ బాబుకు ఉన్న అనుబంధం కార‌ణంగానే బాల‌య్య ఈ మూవీలో న‌టించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో  ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. క‌థ‌, క‌థ‌నాల్లో ప‌ట్టులేక‌పోవ‌డంతో బాల‌య్య చేసిన సాహ‌సం వృధా అయింది. ఫ‌లితంగా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ అయింది.

అయితే బాల‌య్య చేసిన సాయానికి ప్ర‌తి సాయం చేసే అవ‌కాశం మంచు మ‌నోజ్‌కు ఇన్నేళ్ల‌లో ల‌భించ‌లేదు. కానీ ఇప్ప‌టికి బాల‌య్య రుణం తీర్చుకునే అవకాశం మంచు మనోజ్‌ని వెతుక్కుంటూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం గోప‌చంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఓ భారీ యాక్ష‌న్ డ్రామాని చేస్తున్నాడు. ముందు అనుకున్న హిస్టారిక్ ఎపిక్ స్టోరీని ప‌క్క‌న పెట్టి యాక్ష‌న్ క‌థ‌తో దీన్ని అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ ఉంద‌ట‌. దాన్ని మ‌నోజ్ తో చేయించాల‌ని, ఇటీవ‌లే త‌న‌కు స్టోరీ చెప్పార‌ట‌. క్యారెక్ట్ న‌చ్చ‌డం, బాల‌య్య సినిమా కావ‌డంతో మ‌నోజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ వారంలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News