రివ్యూలు అంతగా ప్రభావితం చేయవు: అనీల్ రావిపూడి
సినిమా రివ్యూలు చూసి ఆడియెన్ థియేటర్లకు రావడం లేదు. రివ్యూల ప్రభావం కొంతవరకే. చాలా మంది మౌత్ టాక్ విన్న తర్వాత థియేటర్లకు వస్తున్నారని అన్నారు అనీల్ రావిపూడి.;
సినిమా రివ్యూలు చూసి ఆడియెన్ థియేటర్లకు రావడం లేదు. రివ్యూల ప్రభావం కొంతవరకే. చాలా మంది మౌత్ టాక్ విన్న తర్వాత థియేటర్లకు వస్తున్నారని అన్నారు అనీల్ రావిపూడి. ఆయన తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు ఈ సంక్రాంతి బరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో అనీల్ రావిపూడి చురుగ్గా పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సమీక్షలపై తన అభిప్రాయం చెప్పుకొచ్చారు.
అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. ఎవరైనా మనం తీసిన సినిమాలకు వ్యతిరేకంగా రాస్తుంటే మానసికంగా కొంత కుంగుబాటుకు గురవుతాం. కానీ జనం ఈ రోజుల్లో కేవలం రివ్యూలు చూసి మాత్రమే సినిమా థియేటర్లకు రావడం లేదు. రివ్యూలు సినిమా ఓపెనింగ్స్‌పై కొంత ప్రభావం చూపించవచ్చని, కానీ సినిమా లాంగ్ రన్‌ను మాత్రం ప్రేక్షకుల మౌత్ టాక్ మాత్రమే నిర్ణయిస్తుంది`` అని చెప్పారు. రివ్యూలు అంతగా ప్రభావితం చేయవు.. ప్రేక్షకులకు సినిమా నచ్చితే వాళ్లే థియేటర్లకు వస్తారు. నా టార్గెట్ ఎప్పుడూ ఫ్యామిలీ ఆడియెన్సే అని ఆయన స్పష్టం చేశారు. అయినా రివ్యూలు అన్నీ అవి వారి వ్యక్తిగతమైనవి అని కూడా వ్యాఖ్యానించారు.
ఈ సంక్రాంతికి విడుదలైన తన సినిమా విషయంలో `ఫేక్ రివ్యూలు`, `సోషల్ మీడియా ట్రోలింగ్` గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కొందరు నెగటివ్‌గా ప్రచారం చేయడానికి ప్రయత్నించినా, నేను వాటిని పట్టించుకోను. దానికి బదులుగా అద్భుతమైన కంటెంట్ ఇస్తాను. వాళ్లకు నచ్చితే చూస్తారు. నేను వరుసగా సినిమాలు తీయడంపై మాత్రమే దృష్టి సారిస్తానని అన్నారు. `మనశంకరవరప్రసాద్ గారు` సినిమా కోసం ఫేక్ రేటింగ్స్‌ను అరికట్టడానికి ఒక కొత్త విధానాన్ని కూడా టీమ్ అనుసరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రతి సినిమాకి మిశ్రమ స్పందన కామన్. ఈ సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాలకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి భారీ ఆదరణ లభిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్ (వెంకీ గౌడ పాత్ర), అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్మెంట్ మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి ప్లస్. సెకండ్ హాఫ్‌లో బలహీనమైన విలన్ ట్రాక్ , రొటీన్ క్లైమాక్స్ మైనస్ లు అని క్రిటిక్స్ పేర్కొన్నారు.