ఆ విషయంలో ఎప్పుడూ మా మధ్య గొడవ జరగదు
సెలబ్రిటీల ఇళ్లలో కూడా ఇలాంటివి ఉంటాయా అంటే ఉంటాయని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.;
ఎవరి ఇంట్లో అయినా ఒక టీవీ ఉంటే ఆ ఇంట్లో రిమోట్ కోసం గొడవ జరగడం ఖాయం. సెలబ్రిటీల ఇళ్లలో కూడా ఇలాంటివి ఉంటాయా అంటే ఉంటాయని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఎంతో మంది సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో రిమోట్ కోసం జరిగిన గొడవల్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఈ విషయంలో ఆన్సర్ ఇచ్చారు.
గ్లోబల్ గ్లోబ్స్2026 ప్రెజెంటర్ గా ప్రియాంక
తాజాగా ప్రియాంక చోప్రా ఓ అంతర్జాతీయ వేదికపై మెరిశారు. హాలీవుడ్ లోని అతి పెద్ద అవార్డ్స్ లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్2026లో ప్రియాంక చోప్రా ప్రెజెంటర్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు ఆమె తన భర్త నిక్ జోనాస్ తో కలిసి హాజరయ్యారు. ప్రియాంక, నిక్ ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ రాగా అందరి కళ్లూ వారిపైనే ఉన్నాయి.
ఈ ఈవెంట్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్టార్లు హాజరవగా, అందరూ వీరివైపే చూస్తుండిపోయారు. లాస్ ఏంజిల్స్ లోని బెవర్లీ హిల్స్ లో జరిగిన ఈ ఈవెంట్ కోసం ప్రియాంక హాఫ్ షోల్డర్ బ్లూ గౌన్ ధరించి అందంగా కనిపించగా, నిక్ జోనాస్ బ్లాక్ టక్సడో లో మరింత హ్యాండ్‌సమ్ గా కనిపించారు. అయితే ఈ స్టేజ్ పై ప్రియాంక కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురవగా దానికి ఆమె ఇచ్చిన ఆన్సర్ చాలా సరదాగా ఉంది.
ఇంట్లో రిమోట్ ఎవరి చేతిలో ఉంటుందని అడిగితే, నిక్ చేతిలోనే ఉంటుందని, టీవీలో ఏం చూడాలనే విషయంలో ఎప్పుడూ తమ ఇంట్లో గొడవ జరగదని, ఎవరికి నచ్చింది వాళ్లు చూస్తామని నిక్ చెప్పగా, నిక్ కు నచ్చిన సినిమానే చూడమని చెప్తానని, తనకు కావాల్సింది తాను ఐప్యాడ్ లో చూస్తానని చెప్పిన ప్రియాంక గతేడాది తమకు చాలా గొప్పగా గడిచిందని కూడా చెప్పారు. ఇక కెరీర్ విషయానికొస్తే ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమాలో నటిస్తున్నారు.