తోటి వారిని ప్రశంసిస్తే ట్రోల్ చేస్తారా?
రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన హాక్ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి.;
రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన హాక్ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడం మొదలైన కాసేపటికే హాక్, బాలీవుడ్ వర్గాల నుంచి కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంది. అయితే ఎంతో మంది ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేస్తుండగా, అందులో ఒక సెలబ్రిటీ చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
యామీకి ఆలియా ప్రశంసలు
ఆ సెలబ్రిటీ మరెవరో కాదు. ఆలియా భట్. హాక్ మూవీలో యామీ గౌతమ్ యాక్టింగ్, సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఆలియా చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హాక్ లో యామీ యాక్టింగ్ బావుందని చెప్తూ ఆలియా ఇన్‌స్టాలో ఓ స్టోరీని షేర్ చేస్తూ, తామిద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నామని, ఫోన్ లో తాను యామీకి విషెస్ చెప్పానని రాసుకొచ్చారు.
యామీ ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం ఆలియా ఎగ్జైట్మెంట్
అయితే ఆలియా తన పోస్ట్ లో యామీ గౌతమ్‌ని క్వీన్ అంటూ సంబోధిస్తూ హాక్ లాంటి సినిమాను సెలెక్ట్ చేసుకున్నందుకు ఆమె అభిరుచిని ప్రశంసించారు. ఆమె యాక్టింగ్ ను తనకు అత్యంత ఇష్టమైన ఫీమేల్ రోల్స్ లో ఒకటిగా చెప్తూ, యామీ ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం తాను ఎగ్జైట్ అవుతున్నట్టు చెప్పారు. ఆలియా చేసిన ఈ పోస్ట్ హాక్ మూవీకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించినప్పటికీ సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం దీని వెనుక ఆలియాకు వేరే ఉద్దేశముందని అంటున్నారు.
ఈ విషయంలో పలువురు నెటిజన్లు ఆలియాను తప్పుబడుతూ పోస్టులు చేస్తున్నారు. ఆలియా, యామికి దగ్గరవడానికి ఎందుకు ట్రై చేస్తున్నారని అడుగుతున్నారు. యామీ గౌతమ్ భర్త, దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తో రిలేషన్ ఏర్పరచుకోవడానికి ఆలియా ఇన్‌డైరెక్ట్ గా ప్రయత్నిస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే దురంధర్ సినిమా సక్సెస్ తర్వాత ఆలియా సైలెంట్ గా ఉండటంపై కూడా కొందరు ఆమెను ట్రోల్ చేశారు. ఆలియా చేసిన ఒక్క సోషల్ మీడియా పోస్ట్ వల్ల ఆన్‌లైన్ లో ఇది చాలా పెద్ద డిస్కషన్ గా మారింది. అయితే ఈ విషయంలో పలువురు ఆలియాకు సపోర్ట్ చేస్తూ తోటి నటీనటుల టాలెంట్ ను ప్రశంసించడాన్ని వివాదంగా మార్చకూడదని అంటున్నారు. కాగా ఈ వివాదంపై అటు ఆలియా కానీ ఇటు యామీ కానీ రెస్పాండ్ అవలేదు.