నాన్నకు ప్రేమతో.. వివేక్ ఒబెరాయ్!

Update: 2016-10-27 14:33 GMT
తండ్రికి మాంచి బహుమతి.. అందులోనూ కాస్ట్ లీ కార్ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది.. ఆ తండ్రి మనసు ఎలా స్పందిస్తుంది? ఇప్పుడైతే ఈ  ప్రశ్నలకు వివేక్ ఒబెరాయ్ టక్కుమని ఆన్సర్ ఇచ్చేయగలడు. ఎందుకంటే తన తండ్రి సురేష్ ఒబెరాయ్ కు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చాడు. దీపావళి సందర్బంగా తండ్రికి ఈ గిఫ్ట్ ఇస్తున్నాడు వివేక్ ఒబెరాయ్.

ఈ దీపావళికి ఏదైనా బహుమతి ఇవ్వాలని ఉందని తండ్రితో ఈ హీరో అంటే.. సురేష్ ఒబారాయ్ మాత్రం వద్దలెమ్మన్నారట. . కానీ.. 'వివేక్ ఒబెరాయ్ పట్టు పట్టి మరీ ఒప్పించారు. తండ్రికి నచ్చిన కలర్ లో కారును.. ఇప్పటికే బుక్ చేసి.. సరిగ్గా దీపావళి రోజున అందించనున్నాడు' అని వివేక్ ఒబెరాయ్ ఫ్రెండ్స్ చెబుతున్నారు. 'మా నాన్న నాకు మొదటగా కారు ఇచ్చిన సందర్భం.. ఆ రోజు నేను పొందిన ఆనందం నాకు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు ఆయనకు లగ్జరీ ఎస్యూవీ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా మరోసారి అలాంటి ఆనందం పొందుతున్నా' అంటున్నాడు వివేక్ ఒబెరాయ్.

ఇక సినిమాల విషయంలో అయితే.. 'రాయ్' అంటూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న వివేక్ ఒబెరాయ్.. ఈ మూవీలో అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ గా నటిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News