'అదుర్స్‌2'కి రంగం సిద్ధం

Update: 2015-03-17 09:30 GMT
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌లోని కామెడీ యాంగిల్‌ని నూటికి నూరుపాళ్లు బయటికి తీసిన చిత్రం 'అదుర్స్‌'. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించింది. ఎన్టీఆర్‌ కామెడీ టైమింగ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ఆ చిత్రం చాటి చెప్పింది. కోన వెంకట్‌-గోపీమోహన్‌ సిద్ధం చేసిన స్క్రిప్టు మేజిక్కే అదంతా. ఆ సినిమా చూసి నందమూరి అభిమానులు నిజంగానే అదుర్స్‌ అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే 'అదుర్స్‌'కి సీక్వెల్‌ రాబోతోందన్న ప్రచారం సాగింది. అయితే ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీ అవడంతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. ఇప్పుడు మాత్రం దర్శకుడు వినాయక్‌ 'అదుర్స్‌2' చేయడంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.

        అఖిల్‌తో సినిమా చేస్తున్న వినాయక్‌ తదుపరి ఎన్టీఆర్‌తోనే సినిమా తీస్తారనీ, అది 'అదుర్స్‌2'గానే తెరకెక్కబోతోందనీ తెలిసింది. కోన వెంకట్‌ ఇప్పుడు అఖిల్‌ చిత్రానికి రచయితగా పనిచేస్తున్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్టు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. వెంటనే 'అదుర్స్‌2' కథ సిద్ధం చేయమని వినాయక్‌ చెప్పారట. దీంతో కోన, గోపీమోహన్‌ బృందం అదుర్స్‌2 పనులతో బిజీ అయినట్టు తెలుస్తోంది. ఈ యేడాది చివరిలోపు ఆ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News