విజయ్.. రజనీ కన్నా గ్రేటు
కొన్నేళ్ల ముందు వరకు విజయ్ ను చాలా లైట్ తీసుకునేవాళ్లు తెలుగు జనాలు. కానీ ఇప్పుడు కథ మారింది. తెలుగులోనూ బాగానే మార్కెట్ సంపాదించుకున్నాడతను. ‘జిల్లా’.. ‘తుపాకి’.. ‘స్నేహితుడు’ లాంటి సినిమాలు ఓ మోస్తరుగా అతడికి మార్కెట్ తెచ్చిపెట్టగా.. ఇప్పుడు ‘సర్కార్’తో తెలుగులో విజయ్ రేంజే మారిపోయింది. ఈ చిత్రం తెలుగులో ఏకంగా రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. మరోవైపు కేరళ.. కర్ణాటకల్లోనూ ఈ సినిమా వసూళ్ల మోత మోగించింది. ఇక తమిళనాడు సంగతి చెప్పాల్సిన పని లేదు. మొత్తంగా దక్షిణాదిన అంతటా విజయ్ ‘సర్కార్’తో ప్రభంజనం సృష్టించాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో ఇలాంటి వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు. ఈ చిత్రం అప్పుడే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం విశేషం.
దక్షిణాదిన వరుసగా రెండు సినిమాలతో రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటిన రెండో హీరో విజయ్. తొలి హీరో ప్రభాస్ కావడం విశేషం. అతను ‘బాహుబలి’ రెండు భాగాలతో ఈ మార్కును అందుకున్నాడు. ఐతే ‘బాహుబలి’ అనేది ప్రత్యేకమైన సినిమా. దాన్ని పక్కన పెడితే.. ‘సర్కార్’ కేవలం విజయ్ మేనియా వల్ల ఆడిన సినిమా. ఈ కోణంలో చూస్తే దక్షిణాదిన ఇప్పుడు విజయ్ నంబర్ వన్ అని చెప్పాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం వరుసగా రెండు రూ.200 కోట్ల సినిమాలు ఇవ్వలేదు. ఇంతకముందు ఫాలోయింగ్.. మార్కెట్ విషయంలో రజనీకి.. విజయ్ కి అంతరం చాలా ఉండేది. కానీ గత ఐదారేళ్లలో వరుస బ్లాక్ బస్టర్లతో విజయ్ ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు. ఇప్పుడు రజనీకి.. అతడికి అంతరం పెద్దగా కనిపించడం లేదు. సూపర్ స్టార్ కు దీటుగా నిలుస్తున్నాడతను.