క్రికెటర్ కాబోయి యాక్టరైన దేవరకొండ

Update: 2018-08-20 17:30 GMT
డాక్టర్ కాబోయి యాక్టరైన వారు ఉన్నారు. కానీ మన టాలీవుడ్ సెన్షేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రికెటర్ కాబోయే యాక్టర్ అయ్యాడట.. ప్రాణంగా ప్రేమించే క్రికెట్ లో ఫ్యూచర్ లేదని గ్రహించి యాక్టర్ గా మారాడట.. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ చెప్పుకొచ్చాడు..

విజయ్ మాట్లాడుతూ ‘తాను కాలేజీ రోజుల్లో క్రికెట్ ను పిచ్చిగా ప్రేమించేవాడిని.. తమ క్లాసులో 60మంది ఉంటే 40 మంది క్రికెట్ ఆడేవారే.. అందులో తాను ఒకడిని. అప్పుడు ఫాస్ట్ బౌలింగ్ బాగా వేసేవాడిని.. అందరూ షోయబ్ అక్తర్ అనేవారు. కానీ ఓ సారి స్పీడ్ మిషన్ తీసుకొచ్చి పరీక్షిస్తే నా స్పీడు 90 కి.మీలే అని తేలింది. స్నిన్నర్ అనిల్ కుంబ్లే 100 కి.మీల వేగంతో బంతులేస్తాడు. సో అప్పుడే డిసైడ్ అయ్యా.. ఇంత కాంపిటీషన్ లో తనకు క్రికెట్ ఫ్యూచర్ కాదని’ అని తన పాత విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాడు..

‘నువ్వు గొప్ప బ్యాట్స్ మెన్ కావచ్చు. కానీ 100 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే 10 మంది క్రికెటర్లలో ఒకడిగా నిలబడడానికి నీ శక్తిసామర్థ్యాలను తెలసుకోవాలి.. ఈ విషయంలో కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించి మనకు ఎందులో భవిష్యత్తు ఉందో తెలుసుకొని ప్రయత్నించాలని.. ప్రతిభను మెరుగుపరుచుకోవాలి’ అని క్రికెటర్లకు సూచనలు చేశారు విజయ్ దేవరకొండ..
Tags:    

Similar News