#BeARealMan అనిపించుకున్న రౌడీ...!
ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రెటీలు లాక్ డౌన్ సమయాన్ని 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజుతో టైమ్ పాస్ చేస్తున్నారు. డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ లో ఇప్పుడు స్టార్ హీరోలు సైతం పాల్గొంటున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా ఎన్టీఆర్ విసిరిన సవాలని పూర్తి చేసిన కొరటాల శివ.. ఈ 'బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ని కంటిన్యూ చేయవలసిందిగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండను నామినేట్ చేసాడు. దీనిపై స్పందించిన విజయ్ 'ఇంట్లో మా అమ్మ పనులు చేయనీయడం లేదు.. మమ్మల్ని రియల్ మెన్ లా కాకుండా ఇంకా చిన్న పిల్లల్లాగే ట్రీట్ చేస్తున్నారు.. ఈ లాక్ డౌన్ టైంలో ఏదొక రోజు మీరు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తానని' ట్విట్టర్ లో ఫన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా విజయ్ దేవరకొండ కూడా ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసాడు. నిద్ర లేచిన వెంటనే పక్క బట్టలు సర్ది ఇంట్లో పనులు స్టార్ట్ చేసాడు. వాళ్ళ ఫ్రెండ్ నేర్పించిన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ చేసి ఇంట్లో తమ్ముడికి అమ్మకు తినిపించాడు.
ఈ వీడియోతో విజయ్ దేవరకొండ 'ఎర్లీ మార్నింగ్' 11.45కి నిద్ర లేచినట్లు చెప్తున్నాడు. ఇది మీ ఇళ్లల్లో ట్రై చేసి పేరెంట్స్ తో ఇబ్బందులు తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నాడు. అంతేకాకుండా స్లీప్ ఎనాలిసిస్ కూడా చేసుకున్నాడు. లాక్ డౌన్ కి ముందు డైలీ యావరేజ్ గా 6 గంటలు నిద్రపోయే విజయ్ ఇప్పుడు లాక్ డౌన్ టైంలో డైలీ 9 గంటలకు పైగా నిద్రపోతున్నాడట. అయితే విజయ్ దేవరకొండ 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ లో భాగంగా ఇంటి పనులు చేయడంతో పాటు కొన్ని హౌజ్ హోల్డ్ టిప్స్ కూడా చెబుతున్నాడు. వైన్ అండ్ ఆల్కహాల్ బాటిల్స్ ను తాగేశాక వాటర్ బాటిల్స్ గా రీయూజ్ చేయొచ్చని చెబుతున్నాడు. పొద్దున లేవగానే ఫుల్ బాటిల్ తాగాలి అని చెప్తున్నాడు.. వైన్ కాదండోయ్ వాటరే తాగమంటున్నాడు. డస్ట్ బిన్ కి పాత ప్లాస్టిక్ కవర్ చుట్టి డస్ట్ బిన్ కవర్ గా ఉపయోగించాలి అంటూ టిప్స్ చెప్తున్నాడు. ఎలాంటి క్రైసిస్ అయినా మనకు నచ్చిన వాళ్ళతో ఉంటే ఇబ్బందే లేదని.. అలాంటి వారు లేనివాళ్ల గురించే మనం ఆలోచించాలని చెప్పుకొచ్చాడు. ఈ డాక్యుమెంట్ వీడియో తీసిన తమ్ముడు ఆనంద్ దేవరకొండకు క్రెడిట్ ఇచ్చాడు. అంతేకాకుండా #BeTheRealMan ఛాలెంజ్ ని #BeARealMan ఛాలెంజ్ గా మార్చేశాడు. ఈ ఛాలెంజ్ ను కొనసాగించాల్సిందిగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు ఈ #BeARealMan ఛాలెంజ్ పాస్ చేసాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెట్టిన ఈ 3 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Full View