రష్మిక చుట్టూ కన్నడ నాట ఏం జరుగుతోంది?
టాలీవుడ్‌లో అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న.;
టాలీవుడ్‌లో అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. స్వరాష్ట్ర కర్ణాటక అయినా తెలుగు ఇండస్ట్రీకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. `ఛలో` మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన మాయలో పడేసింది. చిన్న చిన్నగా క్రేజీ స్టార్లతో నటించే అవకాశాల్ని సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. `పుష్ప`, పుష్ఫ 2 సినిమాలతో జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకుని హాట్ ఫేవరేట్‌గా మారింది.
బాలీవుడ్‌లోనూ పగావేసి `యానిమల్`, `ఛావా` సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వందల కోట్లు రాబట్టిన సినిమాల్లో నటించిన హీరోయిన్‌గా అరుదైన రికార్డుని దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో `కాక్‌టైల్ 2`, తెలుగులో `మైసా` సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 26న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న శాస్త్రోక్తంగా వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్ ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగ జరుగనుందని వార్తలు షికారు చేస్తున్నాయి.
ఈ సందర్భంగా రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి గురించి కన్నడ నటుడు సెటైరికల్‌గా కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కన్నడ నటుడు ఓ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ రష్మిక, విజయ్ దేవరకొండల వివాహానికి తమని ఆహ్వానిస్తారని వేచి చూడటం లేదని, రక్షిత్ శెట్టి ప్రస్తుతం పూర్తిగా సినిమాల్లో బిజీగా ఉన్నాడని ఆసక్తికర కామెంట్‌లు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కన్నడకు చెందిన రష్మికపై అక్కడి వారు ఎందుకు ఇలా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు? అని అంతా చర్చించుకుంటున్నారు.
గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని వివాహం చేసుకోవాలనుకుంది. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ ఎంగేజ్‌మెంట్‌ని రష్మిక రద్దు చేసుకుంది. అక్కడి నుంచి టాలీవుడ్‌కే పరిమతమవుతూ వస్తోంది. అంతే కాకుండా కొన్ని ఇంటర్వ్యూల్లో హైదరాబాద్ హోమ్ టౌన్ అని చెప్పడం, ఆ తరువాత కూడా కన్నడ మాట్లాడటం కాస్ట కష్టంగా ఉందనడం, `కాంతార` సినిమా గురించి అడిగితే తాను చూడలేదని చెప్పడంతో రష్మికపై కన్నడ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా తనని కామెంట్ చేయడం, మాతృ భాష ఇండస్ట్రీని మించి ఇతర భాషల ఇండస్ట్రీలకు ప్రాధాన్యత ఇస్తుందని, అంతే కాకుండా రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవడం వంటి కారణాలతో రష్మికపై కన్నడ ప్రజలు ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ సంఘటనలు జరిగి ఏళ్లుగడుస్తున్నా ఇప్పటికీ రష్మికపై వారికున్న అభిప్రాయం మారలేదని తాజాగా కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.