టాక్సిక్ కొత్త పోస్టర్.. యశ్ 'టికెట్' అవతార్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?
రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా నుండి లేటెస్ట్ గా వచ్చిన ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా నుండి లేటెస్ట్ గా వచ్చిన ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌లో యశ్ ని ఒక స్టైలిష్ లుక్ లో చూసి అంతా ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు మేకర్స్ కంప్లీట్ మాస్ అండ్ బ్లడీ లుక్ తో ఉన్న యశ్ రెండో అవతార్ ను రివీల్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ పాత్ర పేరు 'టికెట్' అని ప్రత్యేకంగా అనౌన్స్ చేయడంతో ఇప్పుడు నెట్టింట దీని గురించే పెద్ద చర్చ నడుస్తోంది.
నిజానికి సినిమా టీజర్ వచ్చినప్పుడు యశ్ రెండు రకాల గెటప్స్ లో కనిపిస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ ఇది కేవలం ఒక గెటప్ మార్పు మాత్రమే కాదు, ఇదొక ప్రత్యేకమైన క్యారెక్టర్ అని హింట్ ఇవ్వడంతో అంచనాలు మారిపోయాయి. దీంతో ఈ సినిమాలో యశ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. యశ్ కొడుకుగా ఈ 'టికెట్' పాత్రలో కనిపిస్తారా లేదంటే బ్రదర్ గా మరో రోల్ లో షాక్ ఇస్తారా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ఈ రెండో అవతార్ కి సంబంధించిన పోస్టర్ లో యశ్ కళ్లు చాలా ఇంటెన్స్‌గా, ముఖమంతా రక్తంతో నిండిపోయి ఉన్నాయి. టీజర్ లోని లుక్ కి, ఈ పక్కా మాస్ లుక్ కి అస్సలు పోలిక లేకపోవడం స్పెషల్. గీతూ మోహన్ దాస్ తన కథలో ఈ రెండు పాత్రలను ఎలా డిజైన్ చేశారో అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. యశ్ కి ఉన్న మాస్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ 'టికెట్' క్యారెక్టర్ ని చాలా పవర్‌ఫుల్ గా రాసినట్లు అర్థమవుతోంది.
ఈ సినిమా టీజర్ ఇప్పటికే 197 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుండగా, లేటెస్ట్ పోస్టర్ తో సినిమాపై ఉన్న బజ్ మరింత రెట్టింపు అయింది. కేవలం ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మాత్రమే అనుకున్న వారికి, ఈ రెండో క్యారెక్టర్ ఎంట్రీ తో ఒక పెద్ద ట్విస్ట్ దొరికినట్లయింది. రవి బస్రూర్ అందించే మ్యూజిక్ ఈ రెండు వేర్వేరు పాత్రలకు ఏ రేంజ్ లో హైప్ ఇస్తుందో చూడాలి.
సినిమాలో నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్ కాస్టింగ్ ఉండటం కూడా ఈ ప్రాజెక్టుకు పెద్ద ప్లస్ పాయింట్. 2026 మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. యశ్ తన కెరీర్‌లో ఈసారి ఏదో ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ డ్యూయల్ రోల్ గనుక నిజమైతే బాక్సాఫీస్ దగ్గర యశ్ సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. ఇక 'టాక్సిక్' నుండి వచ్చిన ఈ సెకండ్ అవతార్ అప్‌డేట్ నేటి తరం ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. బిజినెస్ పరంగా కూడా హాట్ టాపిక్ గా మారుతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి. ఆ రెండో పాత్ర వెనుక ఉన్న అసలు సీక్రెట్ తెలియాలంటే మాత్రం మార్చి 19 వరకు వెయిట్ చేయాల్సిందే.