నాగికి ఆ సీక్వెల్ పై ఆశ త‌గ్గ‌ట్లేదుగా!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ గురించి రీసెంట్ గా మరో ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ మొదలైంది.;

Update: 2026-02-21 10:30 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ గురించి రీసెంట్ గా మరో ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ మొదలైంది. మ‌హాన‌టి లాంటి క్లాసిక్ హిట్‌తో తన ప్రతిభను చాటుకున్న నాగి, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవికు ఓ కథ వినిపించారని అప్పట్లో వార్త‌లు వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ఆచరణలోకి మాత్రం రాలేదు. చిరంజీవితో జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమాకు సీక్వెల్ చేయాల‌ని నాగ్ అశ్విన్ అప్పుడు అనుకున్నార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. కానీ త‌ర్వాత దాని గురించి ఎలాంటి వార్తా వినిపించ‌లేదు.

టాలీవుడ్ హిస్ట‌రీలో ఓ మైలురాయిగా జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి

1990లో రిలీజైన ఫాంటసీ ఎంటర్‌టైనర్ జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి మూవీ తెలుగు సినీ హిస్ట‌రీలో ఓ మైలురాయిగా నిలిచింది. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి ఎంతో ఆద‌ర‌ణ‌ను పొందారు. భూమికి దిగివచ్చే దేవకన్య, ఆమెను కాపాడే యువకుడు అనే కాన్సెప్ట్ అప్పట్లో ఆడియ‌న్స్ ను మంత్ర ముగ్ధులను చేసింది.

సోషియో ఫాంటసీ మూవీగా వ‌స్తోన్న‌ విశ్వంభ‌ర

ఈ బ్యాక్ డ్రాప్ లోనే ఆ సినిమాకు సీక్వెల్ గా ఓ కొత్త త‌ర‌హా క‌థ‌ను రెడీ చేసుకుని మెగాస్టార్ తో సినిమా చేద్దామ‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సమయంలో అది ముందుకు వెళ్లలేదు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న తాజా సినిమా విశ్వంభ‌ర కూడా ఫాంటసీ జానర్‌కే చెందినద‌నే విష‌యం తెలిసిందే.

విశ్వంభ‌ర‌లో ఓ ట్విస్ట్

అయితే ఈ సినిమాలో భూమిపైకి దేవకన్య రాకాకుండా, హీరోని మరో గ్రహానికి, విశ్వంభర లోకానికి తీసుకెళ్తూ విశ్వంభ‌ర క‌థ‌ను రాసుకున్నార‌ని ప్రచారం జ‌రుగుతుంది. అంతేకాకుండా విశ్వంభ‌ర మూవీలో జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమాకు సంబంధించిన ఓ ట్విస్ట్ కూడా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే నాగ్ అశ్విన్ త‌న మెగా మూవీ కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ త‌న జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ ఆలోచ‌న‌ను ఇంకా వ‌ద‌లిపెట్ట‌లేద‌ని, ప్ర‌స్తుతం ఆ స్క్రిప్ట్ పై వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని స్వ‌యంగా నాగ్ అశ్విన్ రివీల్ చేశారు. అయితే ఈ విష‌యంపై నెటిజ‌న్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒకే జాన‌ర్ లో రెండు వేర్వేరు కాన్సెప్ట్ ఎలా రూపుదిద్దుకుంటాయ‌ని కొంద‌రు కామెంట్ చేస్తుంటే, మ‌రికొందరు మాత్రం ఎలాంటి జాన‌ర్ ను అయినా నాగ్ అశ్విన్ హ్యాండిల్ చేసే విధానం చాలా కొత్త‌గా ఉంటుంది కాబ‌ట్టి ఈ ప్రాజెక్టు విష‌యంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోన‌క్క‌ర్లేదని త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నారు.

Tags:    

Similar News