తెలిసిన వాళ్లే నాపై కంప్లైంట్ ఇచ్చారు.. మూడు రోజులు నిద్రపోలేదు
అయితే వారి పేర్లు బయటపెట్టనని స్పష్టం చేశారు. వాళ్ల పేర్లు చెప్పడం సరికాదని, ఇప్పటికీ వాళ్లంటే తనకు గౌరవముందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.;
మహిళల దుస్తులపై గతంలో చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నటుడు శివాజీ తాజాగా ఆ అంశంపై స్పందిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తనపై మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసిన వారు బయటివాళ్లు కాదని, తనకు బాగా తెలిసినవాళ్లేనని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇప్పటికీ వారంటే గౌరవముంది
రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడిన శివాజీ, ఆ రోజు తాను మాట్లాడిన తీరు గురించి ఇప్పటికీ బాధపడుతున్నానని, మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసిన వారు తనకు తెలిసిన వారే అని తెలిసి నిజంగా షాక్ అయ్యానన్నారు. అయితే వారి పేర్లు బయటపెట్టనని స్పష్టం చేశారు. వాళ్ల పేర్లు చెప్పడం సరికాదని, ఇప్పటికీ వాళ్లంటే తనకు గౌరవముందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
మూడు రోజులు నిద్ర పట్టలేదు
ఇది కేవలం వివాదం మాత్రమే కాదని, వ్యక్తిగతంగా కూడా తనను కలచివేసిన సంఘటనగా ఆయన వివరించారు. ఆ వ్యాఖ్యల తర్వాత తాను మూడు రోజులు నిద్రపోలేదని, తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యానని తెలిపారు. ఎన్నో ప్రెస్‌మీట్లు, డిబేట్లలో మాట్లాడినా తానెప్పుడూ నోరు జారలేదని, కానీ ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయిందని అన్నారు.
అనసూయను ఏమీ అనలేదు
అదే సమయంలో, ఈ వివాదంలో తన పేరు అనవసరంగా జోడించబడిందని భావిస్తున్న అనసూయ భరద్వాజ్ గురించి కూడా శివాజీ క్లారిటీ ఇచ్చారు. అనసూయతో తనకెలాంటి పరిచయం లేదని, ఆమెను తానేమీ అనలేదని, ఆమెపై తనకు గౌరవముందని తెలిపారు. కొన్ని సందర్భాల్లో మనమేం మాట్లాడుతున్నామో మనకే తెలియదని, అలాంటి సందర్భంలోనే తన నోటి నుంచి ఆ రోజు రెండు తప్పు పదాలు దొర్లాయని శివాజీ చెప్పారు.