కృతజ్ఞత చాలా చిన్నమాట..బాధ్యత వహించండి: స్టార్ హీరో

Update: 2020-06-03 08:30 GMT
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ముగింపుకు వచ్చిందని ప్రజలు కాస్త ఊరటగా ఉన్నారు. దేశం లాక్ డౌన్ లోకి వెళ్లి దాదాపు 70రోజులు కావస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కఠిన చర్యలు తీసుకొని వైరస్ హై రేంజ్ లో విస్తరించకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఆ మాత్రం చర్యలు తీసుకున్నారు కాబట్టే అన్నీ రాష్ట్రాలలో వైరస్ తీవ్రతరం కాలేదని ప్రజలు - అధికారులు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ అది వాస్తవమే. మన భారతదేశం ముందుగానే వైరస్ ప్రభావాన్ని పసిగట్టి లాక్ డౌన్ విధించింది. అందుకు ప్రజలంతా ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నారు. ఇక ఇటీవలే ప్రభుత్వాలు మెల్లగా లాక్ డౌన్ సడలింపులు చేస్తున్నాయి. థియేటర్లు.. విద్యాసంస్థలు తప్ప అన్నింటికీ సడలింపులు లభించాయి. ఇక ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. టాలీవుడ్ హీరో రాష్ట్ర ప్రజలను ప్రభుత్వాలను ఉద్దేశించి ఓ లేఖ ద్వారా ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."ముగింపుకు చేరుకున్నదని కేవలం లాక్ డౌన్ మాత్రమే కరోనా వైరస్‌ కాదని" హెచ్చరించారు విక్టరీ వెంకటేష్‌.

ఇక లాక్‌ డౌన్‌ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించారో వాటిని రానున్న రోజుల్లో కొనసాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని వెంకటేష్‌ కొనియాడారు. ట్విట్టర్‌ ద్వారా వెంకటేష్‌ స్పందిస్తూ "గత 70 రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాయి.  ఈ విపత్కర సమయంలో ప్రజలందరి సంరక్షణ కోసం రాత్రింబవళ్లూ ముందుండి సేవలు చేస్తున్న పోరాటయోధులకు కృతజ్ఞత చెప్పడం చిన్న మాటే అవుతుంది. మా అందరి కోసం మీరు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివి. ద్వారాలన్నీ ఒక్కొక్కటిగా మన కోసం తెరుచుకుంటున్నాయి. ఈ సమయంలో పౌరులంతా బాధ్యతగా వ్యవహరించాలి. సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి’ అని వెంకీమామ తన అమూల్యమైన సందేశాన్ని అందించారు.
Tags:    

Similar News