బులుగు స‌ముద్రంలో ప్ర‌గ్య బికినీ ఫెస్టివ‌ల్

ప్రగ్యా అన్ స్టాప‌బుల్! ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.;

Update: 2026-02-27 03:57 GMT

ప్రగ్యా అన్ స్టాప‌బుల్! ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. తాజా ఇన్ స్టా లింక్ లో తన బికినీ ట్రీట్ తో అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.



 


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సుదూర తీరంలో బులుగు జిలుగు సముద్రంలో ప్రగ్యా అందాల విందు హృద‌యాల‌ను కొల్ల‌గొడుతోంది. మాల్దీవుల తీరంలో నీలి రంగు సముద్రపు నీటిలో ప్రగ్యా జైస్వాల్ దిగిన ఫోటోలు అత్యంత వేగంగా వైర‌ల్ అవుతున్నాయి.



 


తన పోస్ట్‌కు `త్రోబ్యాక్స్ డోంట్ హ‌ర్ట్ ఆన్ ఏ థ‌ర్స్ డే` అంటూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. అంటే.. గురువారం రోజు పాత మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం హానికరం కాదనేది ప్ర‌గ్య‌ ఉద్దేశం. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి వెకేషన్లకు వెళ్ళినప్పుడు తమ వ్యక్తిగత సమయాన్ని ఆస్వాధించడానికి ఇష్టపడతారు. ఫోటోగ్రాఫర్లు లేదా తన తోటి టీమ్ మెంబర్ల‌ సాయంతో ఇలాంటి సోలో ఫోటో షూట్స్ నిర్వహిస్తుంటారు.



 


పార్టీలో రకుల్, లక్ష్మి మంచు ఎక్కడ?

ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి ఎంత‌ మంచి స్నేహితులో తెలిసిందే. వీరంతా తరచుగా కలిసి టూర్లకు వెళ్తుంటారు. అయితే ఫ్రెండ్స్ వారు ఎందుకు లేరంటే..రకుల్ ప్రస్తుతం తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఇతర ప్రాజెక్టులు వెకేషన్లలో బిజీగా ఉన్నారు. మంచు లక్ష్మి తన సొంత షోలు, సోషల్ మీడియా యాక్టివిటీస్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ ట్రిప్‌లో పాల్గొని ఉండకపోవచ్చు. ఇది ప్రగ్యా షేర్ చేసిన‌వి త్రోబ్యాక్ ఫోటోలు కాబ‌ట్టి కుద‌ర‌దు. ప్ర‌గ్యా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, గ్లోబల్ బ్రాండ్స్ అయిన కెల్విన్ క్లెయిన్ (CK) వంటి వాటికి ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది. తన పర్ఫెక్ట్ ఫిజిక్‌తో ఆ బ్రాండ్‌లకు సరైన ఛాయిస్ అని నిరూపించుకుంటోంది.

త‌దుపరి సినిమాలు:

ప్రస్తుతం ప్రగ్యా తన కెరీర్‌ను చాలా ప్లాన్డ్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అక్షయ్ కుమార్ సరసన `ఖేల్ ఖేల్ మే` వంటి సినిమాల్లో మెరిసిన ప్రగ్యా, ప్రస్తుతం బాలీవుడ్ లో మరో రెండు పెద్ద ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఒక అగ్ర హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ లేదా కీలక పాత్ర కోసం చర్చలు జరుగుతున్నాయి. కోలీవుడ్‌లో ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం.

మొత్తానికి వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే ప్రగ్యా స్పీడ్ ఎక్కువగా కనిపిస్తోంది. ముంబై బ్యూటీ తదుపరి సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కంచె త‌ర్వాత చాలా కాలానికి.. మ‌రోసారి వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న అవ‌కాశం కోసం ప్ర‌గ్య ఆస‌క్తిగా వేచి చూస్తోంద‌ట‌.

Tags:    

Similar News