ఆ ఫార్ములాకు నో చెప్పిన శ్రీవిష్ణు టీమ్!
ఒక సినిమా రిలీజ్ అవుతోందంటే ఉండే హడావిడి అంతా ఇంత కాదు. అయితే ఆ హడావిడి జెన్యూన్ టాక్‌ని ఈ మధ్య దెబ్బతీస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.;
ఒక సినిమా రిలీజ్ అవుతోందంటే ఉండే హడావిడి అంతా ఇంత కాదు. అయితే ఆ హడావిడి జెన్యూన్ టాక్‌ని ఈ మధ్య దెబ్బతీస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య చిన్న సినిమాల రిలీజ్‌కు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాపై హైప్ క్రియేట్ అయి ఓపెనింగ్స్ భారీగా వస్తాయని కొంత కాలంగా ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు. అయితే అది ఈ మధ్య బెడిసికొడుతోంది. పెయిట్ ట్వీట్‌లు, సోషల్ మీడియా పెయిట్ రివ్యూల కారణంగా ఇది పక్కదారి పడుతోంది.
అంతే కాకుండా సినిమా సక్సెస్ అయితే ఓకే ముందస్తు ప్రీమియర్స్ చిన్న సినిమాలకు మంచి బూస్ట్‌గా మారుతున్నాయి. మౌత్ టాక్‌తో మరింత మందికి చేరువ అవుతూ అనుకున్నదానికి మించి వసూళ్లని రాబడుతున్నాయి. అయితే కొన్ని సార్లు అవే పెయిడ్ ప్రీమియర్స్ కలిసి రావడం లేదు. టాక్ బాగుంటే ఓకే..బాగాలేకపోతే మొదటికే మోసం వచ్చేస్తోంది. దీంతో సినిమా విడుదలైన రోజుల్లోనే థియేటర్లలోంచి కనిపించకుండా పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ఓ చిన్న మూవీనే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.
ఈ మూవీ రిలీజ్‌కు ముందు పెయిడ్ ప్రీమియర్స్ అంటూ హడావిడి చేశారు. టాక్ బాగుందని, సూపర్ హిట్ అని నెట్టింట ట్వీట్‌లతో వైరల్ అయ్యేలా చూసుకున్నారు. కానీ ఫలితం ఇందుకు విరుద్దంగా రావడంతో జెన్యూన్ టాక్ విషయంలో మిగతా మేకర్స్‌కి సందేహాలు మొదలయ్యాయి. దీంతో కొంత మంది రిలీజ్ బిఫోర్ పెయిడ్ ప్రీమియర్స్‌కు నో చెప్పడం మొదలు పెట్టారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న మూవీ `విష్ణు విన్యాసం`. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా ఆద్యంత వినోదాత్మకంగా తెరకెక్కింది.
ప్రచార చిత్రాలతోనే అంచనాలు పెంచేసి శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్టు పక్కా అనే ఫీల్‌ని కలిగించింది. ఈ సినిమా ఫలితంపై హీరో శ్రీవిష్ణు, మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అయినా సరే పెయిడ్ ప్రీమియర్ కాన్సెప్ట్‌కి దూరంగా ఉండాలని, పెయిడ్ ప్రీమియర్‌కు నో చెప్పేశారు. దీనిపై ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లోనే క్లారిటీ ఇచ్చేసిన టీమ్ దానికే స్టాండ్ అయి ఉండటం గమనార్హం. గతంలో శ్రీవిష్ణు పెయిడ్ ప్రీమియర్స్‌ని ప్రోత్సహించినా ఈ సినిమా విషయంలో మాత్రం దానికి నో చెప్పి ఆశ్చర్యపరిచారు.
వరుస విజయాలతో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న శ్రీవిష్ణు ఈ సినిమాతో తప్పకుండా మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అనుకున్నట్టుగా సక్సెస్‌ని దక్కించుకుంటే వరుసగా నాలుగవ హిట్టు పడినట్టే. ఈ మూవీ తరువాత `మృత్యుంజయ్` మూవీతో రాబోతున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. శ్రీవిష్ణు నుంచి వస్తున్న న్యూ జానర్ ఫిల్మ్ కావడంతో దీనిపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి.