• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ద‌ర్శ‌కుడిని హాకీ స్టిక్...

ద‌ర్శ‌కుడిని హాకీ స్టిక్ క్రికెట్ స్టంప్స్‌తో బాది దోపిడీ చేసారు

| ఫిబ్రవరి 9న బెంగళూరు వచ్చిన అనీష్‌ను ఒక ఇంట్లోకి తీసుకెళ్లి బంధించారు. అక్కడ హాకీ స్టిక్స్‌, క్రికెట్ స్టంప్స్‌తో విచక్షణారహితంగా బాదారు.

By - Sivaji Kontham
Update: 2026-02-27 04:09 GMT

ద‌ర్శ‌కుడిని హాకీ స్టిక్ క్రికెట్ స్టంప్స్ తో బాది దోపిడీ చేసారు. బాధితుడు తీవ్ర గాయాల‌తో ఇప్పుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో జ‌రిగిన‌ ఈ దారుణ సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. `జీవనద భాషె` అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు టి.ఎ. అనీష్ పై జరిగిన ఈ దాడికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే...

ఈ దాడి వెనుక సుమారు 8.5 లక్షల రూపాయల ఆర్ధిక లావాదేవీల వివాదం ఉందని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరైన ఆశీర్వాద్ అనీష్ దగ్గర తీసుకున్న 2.5 లక్షల అప్పు, అలాగే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అనీష్ సినిమాలో పెట్టిన 6 లక్షల పెట్టుబడి విషయంలో గొడవలు జరిగినట్లు సమాచారం. అయితే అనీష్ తన కారును అమ్మాలని ప్రయత్నిస్తుండగా.. నటి ఐశ్వర్య సహాయంతో నిందితులు అతడిని నమ్మించి బెంగళూరుకు పిలిపించారు. ఈ కేసులో ఒక‌ పథకం ప్రకారం కిడ్నాప్ చేసార‌ని పోలీసులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 9న బెంగళూరు వచ్చిన అనీష్‌ను ఒక ఇంట్లోకి తీసుకెళ్లి బంధించారు. అక్కడ హాకీ స్టిక్స్‌, క్రికెట్ స్టంప్స్‌తో విచక్షణారహితంగా బాదారు. దాడి చేయడమే కాకుండా అతని వద్ద ఉన్న 22 గ్రాముల బంగారు ఆభరణాలు, 30,000 నగదు లాక్కున్నారు. అతని ఏటీఎం కార్డు వాడి మరో 5,500 రూపాయలు డ్రా చేశారు. దాడి జరుగుతున్న సమయంలో నిందితుడు లక్ష్మీనారాయణ వీడియో కాల్‌లో ఉండి, అనీష్‌ను కొట్టమని మిగిలిన వారిని రెచ్చగొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఐశ్వర్యతో పాటు మొత్తం 11 మందిని అడుగుడి (కర్నాట‌క‌) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పోలీసులు ఆరు మొబైల్ ఫోన్లు, బంగారం, కారు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

సినిమా రంగంలో ఇలాంటి ఆర్ధిక వివాదాలు హింసాత్మకంగా మారడం దురదృష్టకరం. ప్రస్తుతం అనీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags:    
  • kannadacinema 
  • bengalurucase 
  • taaneesh 
  • jeevanadabhashe 

Similar News

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS