• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ హాసన్ మల్టీ...

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

| వయసు పెరుగుతున్నా కమల్ హాసన్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. నటుడిగా సినిమాలు చేస్తూనే రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్నారు. మరోవైపు మక్కల్ నీది మయ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోనూ చురుకుగా ఉన్నారు. 'ఇండియన్ 3', 'కల్కి 2', రజనీకాంత్‌తో మల్టీస్టారర్‌ వంటి ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-10 12:30 GMT

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వెండి తెర‌పై ఉల‌గ‌నాయ‌గ‌న్ చేయ‌ని ప్ర‌యోగాలు లేవు. నటనలో అందుకోని ఎత్తులు లేవు. సాధారణంగా అరవై ఏళ్లు దాటిన తర్వాత నటులు వేగం త‌గ్గుతుంది.

కానీ కమల్ హాసన్ విష‌యంలో మాత్రం వయసును కేవలం నెంబ‌ర్ మాత్ర‌మే. ఒకే సమయంలో నటుడిగా, నిర్మాతగా రాజకీయ నాయకుడిగా మూడు భిన్నమైన రంగాల్లో దూసుకుపోతున్నారు. నటుడిగా కమల్ హాసన్ ఇప్పటికీ సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ పాత్రకు తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్నారు.

నేటి త‌రం హీరోలకు సైతం పోటీగా ప‌నిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే క‌మ‌ల్ తో పోటీ ప‌డాలంటే? యువ హీరోలే వెన‌క్కి త‌గ్గుతార‌న్న‌ది కాద‌న‌లేని నిజం. మరోవైపు సొంత నిర్మాణ సంస్థ `రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్` బ్యానర్‌పై భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ అక్క‌డా స‌త్తా చాటుతున్నారు. అవ‌స‌రం మేర స్టోరీ డిస్క‌ష‌న్స్ లో పాల్గొంటారు. మ‌రోవైపు తానే సొంతంగా క‌థ‌లు అందిస్తున్నారు. ఇతర స్టార్ హీరోలు - యంగ్ డైరెక్టర్ల కాంబినేషన్‌లలో వైవిధ్యమైన సినిమాలకు నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు.

అలాగే ప్రజాక్షేత్రంలోనూ కమల్ హాసన్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. `మక్కల్ నీది మైయం` పార్టీ అధ్యక్షుడిగా తమిళనాడు రాజకీయంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సమాజంలో మార్పు కోసం, ప్రజల సమస్యలపై గ‌ళం విప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాజకీయ వేదికలపై సైతం నాయకుడిగా ఉనికిని చాటుకుంటున్నారు. నటన, నిర్మాణం, రాజకీయం.. ఇలా ఏ ఒక్క రంగంలోనైనా నిలదొక్కుకోవడం కష్టమైన రోజుల్లో మూడింటినీ సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ నడిపించడం కమల్ హాసన్‌కే సాధ్యమైంది. ఏ పడవలోనూ పట్టు సడలకుండా మూడింటినీ ఒకేసారి విజయవంతంగా నడుపుతూ కమల్ హాసన్ సాగిస్తున్న మల్టీ టాస్కింగ్ ప్రయాణం నిజంగా అద్భుతమనే చెప్పాలి.

ప్ర‌స్తుతం క‌మ‌ల్ న‌టుడిగా పుల్ బిజీగా ఉన్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఇండియ‌న్ 3`లో న‌టిస్తున్నారు. మ‌రోవైపు `క‌ల్కి 2` షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు ఎక్కువ‌గానే డేట్స్ కేటాయించారు. అలాగే రజనీకాంత్‌తో న‌టించ‌బోయే `కెహెచ్ ఏఆర్ కే` మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ కూడా లైన్‌లో పెట్టారు. మ‌రోవైపు క‌మ‌ల్ ఫిట్ నెస్ విష‌యం లోనూ అంతే జాగ్ర‌త్త‌గా ఉంటారు. డైలీ జిమ్..ర‌న్నింగ్ వంటివి త‌ప్ప‌నిస‌రిగా చేస్తారు. డేలో క‌నీసం 20 కిలీమీట‌ర్లు అయినా? ర‌న్నింగ్ చేయ‌డం క‌మ‌ల్ కు కొన్ని ద‌శాబ్దాల‌గా ఉన్న అల‌వాటు. ఇలా అన్ని ర‌కాలుగా క‌మ‌ల్ ప్ర‌యాణం దేదీప్య మానంగా సాగిపోతుంది.

Tags:    
  • kamalhaasan 
  • ulaganayagan 
  • indian3 
  • kalki2 
  • kollywood 

Similar News

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

2026-11-10 09:55 GMT

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

2026-11-10 09:39 GMT

ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!

2026-11-10 09:38 GMT

టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!

2026-11-10 08:30 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS