• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్ – అన్నా...

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

| పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడిపోతున్నారనే వార్తలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజుకు అన్నా ప్రేమగా శుభాకాంక్షలు చెప్పడంతో, కేవలం రెండు నెలల్లోనే ఏం మారిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుకకు ఇద్దరూ హాజరుకాకపోవడం కూడా అనుమానాలకు కారణమైంది. అయితే విడిపోవడానికి గల కారణాలపై స్పష్టత లేదు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-10 07:49 GMT

సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో జరిగే పరిణామాలు ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంటాయి. ముఖ్యంగా ఎంతోకాలం కలిసి జీవించిన జంట విడిపోతున్నట్లు ప్రకటిస్తే అందరిలోనూ ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడిపోవాలనే నిర్ణయం కూడా ఫాన్స్ దగ్గర నుంచి ఎన్నో అనుమానాలు తెచ్చిపెడుతున్నాయి. 13 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే అందరినీ ఎక్కువగా ఆలోచింపజేస్తున్న విషయం మాత్రం ఒక్కటే. కేవలం రెండు నెలల్లోనే అసలు ఏమైపోయింది అని.

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల 2013 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాతో పవన్ హైదరాబాద్‌లో ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్నేళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను షాక్ కి గురి చేసింది.

అయితే ఈ వార్తలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో విషయం ఏమిటి అంటే.. గత రెండు నెలల్లో జరిగిన పరిణామాలు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నా కొణిదెల సోషల్ మీడియాలో చాలా చాలా ప్రేమగా.. శుభాకాంక్షలు తెలిపారు. భర్తతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఎంతోమంది హృదయాల్లో పవన్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో మంచి పోస్టులు పెడుతూ వచ్చింది.

కానీ ఇప్పుడు విడిపోతున్నట్లు వార్తలు రావడంతో ఆ పాత పోస్టును అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. రెండు నెలల క్రితం ఎంతో ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అన్నా ఇప్పుడు విడిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు.. ఈ తక్కువ సమయంలో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నాయా.. అనేది అందరిలో అందరిలో మొదలైన ప్రశ్న.

ఇదే సమయంలో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడం, అన్నా కొణిదెల కూడా ఆ వేడుకలో కనిపించకపోవడంతో కొందరు అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఎంగేజ్మెంట్ కి ముందే వీళ్ళిద్దరూ విడిపోవాలని ఫిక్స్ అయి ఉంటారని.. కానీ దానికి గల కారణాలు మాత్రం ఏమిటి అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. మొత్తానికి వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు.. విడాకులకు గల కారణం చెప్పేవరకు.. ఎవరికి క్లారిటీ రాదేమో.

Tags:    
  • pawankalyan 
  • annakonidela 
  • divorcereports 
  • megafamily 
  • annalezhneva 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS