• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీదేవి కూతురుపై ఎన్నో...

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

| శ్రీదేవి కూతురిగా తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సంపాదించుకున్న జాన్వీ కపూర్.. 'దేవర'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే ఆశించిన గుర్తింపు రాలేదు. తాజాగా 'కాఫీ విత్ కరణ్'లో దక్షిణాది దర్శకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలపై ఆసక్తి తగ్గుతుందా అనే చర్చ మొదలైంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-10 11:30 GMT

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాల్లోకి వస్తోందంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒకప్పుడు ఎంతో ఆసక్తి కనిపించింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో.. ఆమె ఎంట్రీ కోసం చాలామంది ఎదురుచూశారు. దీనికి ప్రధాన కారణం శ్రీదేవికి తెలుగు సినిమాలతో ఉన్న బీభత్సమైన క్రేజ్. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగిన శ్రీదేవి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఒకరకంగా అన్ని భాషల కన్నా కూడా శ్రీదేవి సొంత భాష తెలుగులో ఆమె ఎన్నో విజయాలు అందుకుంది. అలాంటి నటి కూతురు తెలుగు సినిమాల్లోకి వస్తే ఆమె కూడా ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని చాలామంది భావించారు. కానీ ఇప్పటివరకు పరిస్థితులు మాత్రం అనుకున్నట్లుగా లేవు.

జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాపై ఆమెకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయినప్పటికీ మొదటి సినిమాతోనే ఆమె ప్రయాణాన్ని అంచనా వేయడం సరైంది కాదని.. చాలామంది భావించారు. తర్వాతి సినిమాలతో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశించారు.

కానీ ఆ తర్వాత కూడా జాన్వీకి అనుకున్న స్థాయిలో విజయం, ప్రశంసలు దక్కలేదు. రామ్ చరణ్‌తో వచ్చిన పెద్ది సినిమా.. ఆమెకు ప్రశంసలు కన్నా ఎక్కువ విమర్శలు తెచ్చి పెట్టింది. అసలు శ్రీదేవి కూతురు ఇలాంటి సినిమాలు ఎందుకు ఒప్పుకుంటుంది అని ఎంతోమంది అసహనం వ్యక్తం చేశారు. అయినా కూడా సరేలే రామ్ చరణ్ సినిమా కాబట్టి ఒప్పుకోనుంటుంది.. తర్వాత అయినా ఈ అమ్మడు ప్రూవ్ చేసుకుంటుందేమో అని ఎవరో ఛాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ద పడ్డారు తెలుగు ప్రేక్షకులు.

కానీ ఇటీవల కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో దక్షిణాది దర్శకుల గురించి జాన్వీ చేసిన వ్యాఖ్యలు మొత్తం సీన్ రివర్స్ చేసాయి. సౌత్ దర్శకులపై డైరెక్ట్గా కామెంట్ చేయడంతో.. తెలుగు ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. శ్రీదేవి కూతురిగా ఆమెకు ఇంతకాలం ప్రత్యేకమైన అభిమానం చూపించినవారిలో కూడా కొందరు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలో జాన్వీ కపూర్ కి అవకాశాలు ఇవ్వాలంటే తప్పకుండా తెలుగు దర్శకులు ఆలోచిస్తారు. మరి ఇలాంటి తరుణంలో జాన్వీకపూర్ తెలుగులో ఎలా ప్రూవ్ చేసు కోగలుగుతుంది అనేది ఎంతోమందిలో ఉన్న ప్రశ్న. శ్రీదేవి కూతురు ఇక్కడ కూడా శ్రీదేవి అంత హీరోయిన్ అవుతుంది అనుకున్న వాళ్లు అందరూ.. టాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోకుండానే ఎందుకు ఈమె కెరియర్ ఇలా అయిపోయింది అని నిరాశ పడుతున్నారు.

Tags:    
  • janhvikapoor 
  • tollywood 
  • devara 
  • peddi 
  • southcinema 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS