ఎగ్ ఫ్రీజింగ్ నుంచి ఫ్యామిలీ ప్లాన్స్ వరకు… డైసీ షా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ డైసీ షా, ఇప్పుడు తన వ్యక్తిగత నిర్ణయాలతో వార్తల్లో నిలిచింది.;
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ డైసీ షా, ఇప్పుడు తన వ్యక్తిగత నిర్ణయాలతో వార్తల్లో నిలిచింది. 41 ఏళ్ల వయసులో కూడా పెళ్లిపై తనకు ఆసక్తి లేదని, ఒంటరిగానే ఉండటం ఇష్టమని ఆమె కుండబద్దలు కొట్టింది. మరీ ముఖ్యంగా 'ఎగ్ ఫ్రీజింగ్' వంటి విషయాలపై ఆమె చేసిన ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు పెళ్లి లేకుండానే ఫ్యామిలీని ఎలా ప్లాన్ చేయవచ్చో ఆమె తనదైన స్టైల్లో వివరించారు. ఆ వివరాలు చూద్దాం..
పెళ్లిపై నో క్లారిటీ:
రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో డైసీ షా మాట్లాడుతూ.. తన జీవితంలో పెళ్లికి చోటు లేదని స్పష్టం చేశారు. తన చుట్టూ ఉన్న జంటలు విడిపోతున్న వార్తలు వింటుంటే చాలా భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. "నాకు ఒక తోడు కావాలని నేను అనుకోవడం లేదు. నేను నా సొంతంగా బాగానే సంపాదిస్తున్నాను. కేవలం తియ్యటి మాటలు చెప్పే వారిని నమ్మి పెళ్లి చేసుకునే స్థితిలో నేను లేను. ప్రేమ అనేది మొదట్లో బాగుంటుంది కానీ, ఆ తర్వాత వచ్చే ఆర్థిక ఇబ్బందులు, మనస్పర్థలు భరించడం చాలా కష్టం" అంటూ ఆమె తన ప్రాక్టికల్ ఆలోచనలను పంచుకున్నారు.
ఎగ్ ఫ్రీజింగ్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లిని అవుతా!:
తల్లి కావడానికి పెళ్లితో సంబంధం లేదని డైసీ షా ఒక సెన్సేషనల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. "నేను ఇప్పటికే నా 'ఎగ్స్‌ని ఫ్రీజ్' చేయించాను. కాబట్టి భవిష్యత్తులో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తల్లిని కాగలను. ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి కేవలం పెళ్లి మాత్రమే దారి కాదు" అని ఆమె వివరించారు. ఇక ఈ నిర్ణయం ద్వారా ఆమె తన స్వతంత్రతను చాటుకున్నారు. పిల్లల కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని, టెక్నాలజీ సాయంతో తనకు నచ్చినప్పుడు సొంత బిడ్డను కనే అవకాశం ఉందని ఆమె ధీమాగా చెప్పారు.
డబ్బు ఉంటేనే ప్రశాంతత.. స్వతంత్రమే ముఖ్యం:
ప్రేమ గురించి మాట్లాడుతూ.. కేవలం ప్రేమతో కడుపు నిండదని, ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా ముఖ్యమని డైసీ అభిప్రాయపడ్డారు. "నా దగ్గర తగినంత డబ్బు ఉంది, కానీ నా జీవితంలోకి వచ్చే వ్యక్తి కూడా ఒక స్థాయిని కలిగి ఉండాలి. పెళ్లి చేసుకుని మరొకరి మీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు" అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక తన జీవితంలో చాలా మంది పురుషులు ఆమె పెళ్లికి సిద్ధంగా ఉందని ఊహించుకున్నారని, కానీ తాను ఎప్పుడూ అలా చెప్పలేదని డైసీ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి డైసీ షా చేసిన ఈ వ్యాఖ్యలు నేటి ఆధునిక మహిళల ఆలోచనా దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.