ఉగాది నుంచి మెగా 'విశ్వరూపం'?
ఓవైపు ఉస్తాద్ భగత్ సింగ్, మరోవైపు పెద్ది సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లతో పాటు, మెగాస్టార్ చిరంజీవి విశ్వరూపం ప్రదర్శిస్తున్న 'విశ్వంభర' ట్రీట్ కూడా షురూ అవుతుందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే...;
ఉగాది నుంచి మెగా ట్రీట్ మొదలు కానుందని సమాచారం. ఓవైపు ఉస్తాద్ భగత్ సింగ్, మరోవైపు పెద్ది సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లతో పాటు, మెగాస్టార్ చిరంజీవి విశ్వరూపం ప్రదర్శిస్తున్న `విశ్వంభర` ట్రీట్ కూడా షురూ అవుతుందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే...
మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో ఈ సంక్రాంతి బరిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు తన తదుపరి విజువల్ ఫీస్ట్ `విశ్వంభర`తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలపై గత కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడనుంది. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. మెగా ఫ్యాన్స్‌కు అసలైన ట్రీట్ `ఉగాది` నుంచే మొదలుకాబోతోంది. ట్రైలర్ తో అసలైన ప్రచారం ప్రారంభించేందుకు ప్రతిదీ సిద్ధం చేస్తున్నారని సమాచారం.
దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్ బ్యూటీతో తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ నాటికే సినిమా ఫైనల్ కట్ సిద్ధం కానుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆలోపే ఇతర బిజినెస్ డీల్స్ పూర్తవుతాయని సమాచారం.
జూలైలో సోలో రిలీజ్ లక్ష్యంగా విశ్వంభరను సిద్ధం చేస్తున్నారని కూడా గుసగుస వినిపిస్తోంది. అయితే ఈ సినిమా 1990 బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు- అతిలోక సుందరి ఫీట్ ని గుర్తు చేయడం ఖాయమని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ విజువల్ బ్యూటీతో అద్భుతంగా ఉంటుందని దర్శకుడు కూడా చెబుతున్నారు.
ఒకే ఏడాదిలో మన శంకర వరప్రసాద్ గారు, విశ్వంభరతో బ్లాక్ బస్టర్లు కొడితే చిరంజీవి పేరు మళ్లీ మార్మోగుతుంది.. ఒక సినిమాతోనే 300 కోట్లు వసూలు చేసిన చిరు తదుపరి చిత్రంతో మరో 300 కోట్లు పైగా వసూలు చేయాలని అభమానులు ఆకాంక్షిస్తున్నారు. ఒకవేళ `విశ్వంభర` రూ.300 కోట్లు వసూలు చేస్తే.. ఒకే ఏడాదిలో రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఏకైక సీనియర్ హీరోగా చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టిస్తారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే ఏడాది రెండు భారీ బ్లాక్ బస్టర్లు ఒక సీనియర్ హీరో ఖాతాలో పడటం అనేది ఒక అరుదైన రికార్డు అవుతుంది. ఒక సినిమా (MSG) పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే, రెండోది (విశ్వంభర) టెక్నికల్ వండర్. ఈ వైవిధ్యం చిరంజీవిని మళ్ళీ నంబర్ వన్ స్థానంలో తిరుగులేని విధంగా నిలబెడుతుంది. ఏప్రిల్ (ఉగాది) నాటికి ట్రైలర్ వచ్చి, జూలైలో సినిమా రిలీజ్ అయితే, చిరంజీవి పేరు దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగుతుంది.